చుట్టాలబ్బాయి..పాటలు..ఫైట్లు..కామెడీ

కుర్ర హీరోలంతా సమ్ థింగ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు, సమ్ థింగ్ నావెల్ పాయింట్ వున్న సినిమాలు వెదుక్కుని మరీ చేస్తున్నారు. యంగ్ హీరో ఆది మాత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్ మెంట్ జోనర్ నే ఎంచుకున్నట్లుంది. అతగాడు నటిస్తున్న చుట్టాలబ్బాయి టీజర్ చూస్తుంటే. కచ్చితంగా ఇదే అనిపిస్తుంది. ద

ర్శకుడు వీరభద్రమ్ చౌదరిది కూడా కామెడీ ట్రాక్ రికార్డే. అందుకే ఇద్దరు కలిసి ఈ సేఫ్ జోనర్ నే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. టీజర్ కలర్ ఫుల్ గానే వుంది. హీరో రికవరీ ఏజెంట్ గా పని చేయడం అన్నది గతంలో కొంతమంది హీరోలు ట్రయ్ చేసిందే. టీజర్ కలర్ ఫుల్ గా వుంది. హీరో..హీరోయిన్లు అందంగా వున్నారు..పాటలు..ఫైట్లు ఓకె. 

Watch Chuttalabbayi Teaser

కామెడీ టేస్ట్ సినిమాలో ఏమో తెలియదు కానీ టీజర్ లో పెద్దగా అందలేదు,. ఏదీ చుట్టాలబ్బాయిని ఇప్పుడే కదా చూడడం.. ట్రయిలర్, సినిమా వస్తే ఎలా వుంటాడో పూర్తిగా తెలుస్తుంది. కొసమెరుపు ఏమిటంటే, టీజర్ ప్రారంభంలో 'ఎవరీ అబ్బాయి' అంటూ డైరక్టర్ చౌదరి నే ప్రశ్నించడం..పోసాని చేత చుట్టాలబ్బాయి అని సమాధానం చెప్పించడం.

Show comments