ఏపీ సీఎం చూపు అంతా దంపతుల బెడ్రూమ్ మీదేనా!

బహుశా భారత దేశానికి ఇంతకు మించిన సమస్య లేదని భావిస్తున్నట్టుగా ఉన్నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పిల్లలు కనండన్న తన సందేశాన్ని క్రమం తప్పకుండా వినిపిస్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి. ఒకసారి కాదు.. ఇప్పటికే చాలా సార్లు. ఏపీ ముఖ్యమంత్రి దంపతుల బెడ్రూమ్ వ్యవహారాల గురించి సందేశాలు దంచారు. 

ఒకరితో ఆపవద్దు.. ఎక్కువమందిని కనండి.. అంటూ ముఖ్యమంత్రి హితబోధ చేస్తూ వస్తున్నాడు. భవిష్యత్తులో జనాభా సమతుల్యత దెబ్బ తింటుందని.. దాని కోసం ఇప్పుడు ఒకరితో పరిమితం కావొద్దు.. ఎక్కువమంది పిల్లలను కనండని బాబు చెబుతున్నాడు! భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను.. నా విజనేమిటో చూడండి.. అని బాబుగారు చెప్పుకొంటున్నారు. కానీ అధిక జనాభాతో బాధపడుతున్న భారతదేశం విషయంలో బాబు ప్రస్తుత సమస్య  గురించి మాట్లాడటం లేదు! 

జనాభా సమతుల్య రేటు.. వంటి విషయాల గురించి లెక్చరిస్తున్న బాబు గర్భస్త మహిళల మరణాల రేటు,  శిశు మరణాల రేటు.. విషయంలో భారతదేశం ప్రపంచంలోనే చాలా ముందుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలను పౌష్టికాహార లోపం వేధిస్తోంది. మరి ప్రభుత్వం పరంగా గర్భిణులకు సరైన వైద్య సౌకర్యాలు కల్పించడం, ప్రసవం సమయంలో సంభవిస్తున్న స్త్రీ, శిశు మరణాలను నిరోధించడం.. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం వంటి వ్యవహారాల్లో  ప్రభుత్వం విజయవంతమైన దాఖలాలు లేవు! 

పుట్టిన పిల్లలను కాపాడలేకపోతున్నారు. బతికిన వాళ్లకు మంచి ఆహారాన్ని అందించలేకపోతున్నారు. కానీ ఈ టాపిక్స్ గురించి మాట్లాడకుండా.. సుఖసంసారం గురించి మాట్లాడుతున్నారు! అయినా బాబు గారు.. సమాజానికి ఈ సందేశం ఇచ్చేయడాని కన్నా ముందు తన ఇంట్లో వ్యవహారాలను కూడా చూసుకోవాలనేది టీ స్టాల్ల్స్ లో వినిపిస్తున్న మాట! ఆర్థికంగా ఉన్న వారిలో కూడా స్వార్థం పెరిగిపోతోందని అందుకే ఒక పిల్లాడు లేదా ఒక పాపతోనే ఆపేస్తున్నారని.. బాబు వ్యాఖ్యానించిన నేపథ్యంలో బాబు కుటుంబం తీరు పై కూడా కామెంట్లు వినిపిస్తున్నారు. 

దాదాపు దశాబ్దం కిందట వివాహం చేసుకున్న చంద్రబాబు తనయుడు ఇంతవరకూ ఒక పిల్లాడికే పరిమితం అయ్యాడు! మరి ముందుగా బాబు తన ఇంట్లో పెరిగిన ‘స్వార్థం’ మీద దృష్టి సారించి.. తమను తాము నిస్వార్థ పరులుగా నిరూపించుకుని.. ఆ తర్వాత జాతికి సందేశం ఇస్తే బాగుంటుందనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి! 

Show comments