పూనమ్ ప్రకంపనలు మళ్లీ ప్రారంభం

ఈమధ్య కొన్ని రోజులు సైలెంట్ అయింది పూనమ్ పాండే. సోషల్ మీడియాలో రోజుకో హాట్ స్టిల్ రిలీజ్ చేస్తూ కుర్రకారును కవ్వించే ఈ బ్యూటీ, తాజాగా మరోసారి తన అందాల పంజా విసిరింది. 3 రోజుల నుంచి వరుసగా రోజుకో స్టిల్ రిలీజ్ చేస్తోంది. ఈసారి పూనమ్ టార్గెట్స్ వేరే ఉన్నాయి.

ఈ మధ్యే పూనమ్ పాండే కొత్తగా యాప్ రిలీజ్ చేసింది. ఆ యాప్ కు మరింత ప్రమోషన్ కల్పించేందుకు ఇన్ స్టాగ్రామ్ ను వాడుకుంటోంది. రోజుకో హాట్ పిక్ రిలీజ్ చేస్తూ, "ఏం నాయనా ఇంకో లడ్డూ కావాలా అయితే నా యాప్ డౌన్ లోడ్ చేస్కో" అని ఊరిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఇన్ స్టాగ్రామ్ లో టీజర్ రిలీజ్ చేసి, ఫుల్ సినిమా యాప్ లో చూడమంటోంది పూనమ్ పాండే.

ఈ పిల్లకు ఇప్పుడు సినిమాలు తగ్గిపోయాయి. ఆ మధ్య 2-3 భాషల్లో కలిపి ఒకేసారి సినిమాలు చేసినప్పటికీ.. తాజాగా పూనమ్ తో సినిమాలు నిర్మించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం చేతిలో "ఆగయా హీరో"  అనే ఒకేఒక్క సి-గ్రేడ్ మూవీ ఉంది. అందులో కూడా ఈమె హీరోయిన్ కాదు. ఐటెంసాంగ్ మాత్రమే చేస్తోంది. అందుకే సినిమాల కంటే సోషల్ మీడియాను నమ్ముకోవడమే బెటర్ అని ఫిక్స్ అయింది.

Show comments