జనతా గ్యారేజ్ తరువాత కాస్త గ్యాప్ తీసుకుంటాను అన్నారు ఎన్టీఆర్. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేసేసేను, కాస్త విశ్రాంతి కావాలి అన్నారు. కానీ గ్యారేజ్ విడుదలై అప్పుడే రెండు రోజులు కాకుండానే కథలు వినడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. తన తరువాతి సినిమా కథ విషయంలో ఎన్టీఆర్ చాలా క్లారిటీతో వున్నారట. ఇప్పుడు ఎన్టీఆర్ కు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ వున్న లవ్ స్టోరీ కావాలట. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే గతంలో నాగార్జున చేసిన లాంటివి. అంటే నిన్నే పెళ్లాడుతా టైపు అన్నమాట.
వక్కతం వంశీ బయటకు వెళ్లడానికి కూడా అదే కారణం అంట. వక్కతం వంశీ ఎన్టీఆర్ కోసం తయారుచేసిన స్క్రిప్ట్ పూర్తిగా ఎమోషనల్ గా వుందట. టెంపర్ లో ఫుల్ ఎమోషనల్ లో ఎన్టీఆర్ అరుస్తూ ఎమోషన్ గా చేసినట్లే వుంటుందట ఈ స్క్రిప్ట్ లో ఆ క్యారెక్టర్. అది కూడా థ్రూ అవుట్ ది మూవీ. అందుకే తరువాత చేద్దాం అని ఎన్టీఆర్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
సో ఎన్టీఆర్ కథ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది కాబట్టి, డైరక్టర్లు ట్రయ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు.