హీరోయిన్ కూతురు.. హీరోయిన్ గా వచ్చేస్తోంది!

మొన్నటి వరకూ సారా అలీఖాన్ ను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడానికి తెగ ప్రయత్నించాడు కరణ్ జొహార్. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ లో తను రూపొందించే స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ -2 లో సారాను నటింపజేయడానికి ఆయన ప్రయత్నాలు సాగాయి. అయితే సారా తల్లి అమృత అందుకు సమ్మతించలేదు. సారాను హీరోయిన్ గా చేస్తాను కానీ.. ఇప్పుడు కాదు అని ఆమె అన్నారట.

ఈ నేపథ్యంలో సారా కన్నా క్రేజీ టీనేజర్ ను హీరోయిన్ గా చేస్తున్నాడట కరణ్. సదరు టీనేజర్ మరెవరో కాదు.. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.

టీనేజ్ లో ఉండగానే జాన్వీని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయాలని.. చాలా మంది బడా ప్రొడ్యూసర్లు, దర్శకులు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆ అవకాశం కరణ్ కు దొరికిందని సమాచారం. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సీక్వెల్ లో జాన్వీ హీరోయిన్ గా నటించడం ఖాయమైందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నదనే మాట వినిపిస్తోంది. ఇది వరకూ ఆలియా భట్, వరుణ్ ధావన్ లను ఇంట్రడ్యూస్ చేసిన నేపథ్యం, బాలీవుడ్ లో బడా మూవీ మేకర్ అనే పేరుంది కాబట్టి.. కరణ్ కు శ్రీదేవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చు. అంటే.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాన్వీ ఇంట్రడక్షన్ కు టైమొచ్చిందనమాట! Readmore!

Show comments

Related Stories :