గుసగుసలు : గంటా వైసీపీలోకి?

తెలుగుదేశం మంత్రి గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ గెలుస్తుందని రాజకీయవర్గాల ప్రచారం. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో సంతృప్తిగా లేరని, రోజురోజుకూ పార్టీ గ్రాఫ్ పడిపోవడం, చంద్రబాబు ప్రజాదరణ తగ్గిపోవడంపై ఆందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది. అంతేకాక ఆయన వ్యాపారాలు కూడా సవ్యంగా సాగడం లేదని, ఆర్థిక నష్టాల్లో ఉన్నారని సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు వైసీపీ పట్ల జనాదరణ పెరగడం కూడా గంటా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సరైన సమయంలో వైసీపీలో చేరే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 

ఆత్మరక్షణలో చంద్రబాబు… 
తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం ద్వారా తమిళ ప్రజలు తాము అనుకున్నది సాధించడంతో చంద్రబాబునాయుడు ఆత్మరక్షణలోపడ్డారు. నిజానికి జల్లికట్టు ఉద్యమానికి ముందే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వ్యతిరేక ఉద్యమానికి వ్యూహరచన జరిగింది. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం వెనుక అదృశ్యహస్తం ఉన్నదని చెపుతున్నారు. అక్కడ పోలీసులు వాహనాలను తగులబెడుతూ కనపడిన విషయం తెలిసిందే. అదేవిధంగా సరిగ్గా జల్లికట్టు ఉద్యమం తర్వాత ఏపీలో ఉద్యమం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇప్పటినుంచీ చంద్రబాబు గ్రాఫ్ విపరీతంగా పడిపోతుందని, చంద్రబాబు వ్యతిరేకంగా అన్ని శక్తులూ ఏకమవుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ నేతలు పలువురు ఇతర పార్టీల్లో చేరే అవకాశాలు లేకపోలేదు. 

Show comments