మొగుడిగా పవన్ కు 5/10 అంట

చంద్రుడికో మచ్చ వున్నట్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితంలో ఈ పెళ్లిళ్ల మచ్చ ఒకటి మిగిలిపోయింది. ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి అని కిట్టనివారు విమర్శిస్తుంటారు. పెళ్లాలని బాగా చూసుకోలేని వాడు జనాలను ఏం చూస్తాడు అని కూడా అంటుంటారు. అయితే ఇంతకీ ఆ పెళ్లాలు పవన్ గురించి ఏం అనుకుంటున్నారు?

పవన్ తొలి భార్య జనాలకు పెద్దగా తెలియదు. ఆమె లైమ్ లైట్ లో లేరు. సోషల్ సర్కిల్ లో కూడా కనిపించరు. ఇక రెండో భార్య రేణు దేశాయ్ సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఆమెనే అడిగారు ఈ క్వశ్చను. భర్తగా పవన్ కు ఎన్ని మార్కులు వేస్తారు? అంటూ. దానికి ఆ మాజీ భార్య జస్ట్ పదికి అయిదు మార్కులు అని చెప్పేసింది. ఓ మాజీ భార్య భర్తకు తన కారణంగా దూరమైనా, అతని కారణంగా దూరమైనా అంతకన్నా ఎక్కువ మార్కులు వేస్తుందని అనుకోలేం.

మొత్తానికి భర్తగా పవన్ కు జస్ట్ ఏవరేజ్ మార్కులు పడ్డాయన్నమాట. అయితే తండ్రిగా పదికి పది వేస్తానంది రేణు దేశాయ్. పొలిటిషయన్ గా ఇప్పటికి పదికి పది అని, కానీ ఏదైనా సరే, ఆయన రంగలోకి దిగాకే కచ్చితంగా చెప్పగలను అంది. అంటే రేణు కూడా ఈ విషయంలో కాస్త అనుమానాలు వున్నట్లున్నాయ్.

Show comments