బాలయ్య నోట మందు పాట

సినిమా హీరోలు నటులు పాటలు పాడడం కామన్ అయిపోయింది. చిరంజీవి నుంచి కోటా శ్రీనివాస రావు లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టు వరకు అందరూ పాటలు పాడేసారు. మందుబాబులం మేము మందుబాబులం అంటూ కోటా పాడేసాడు. ఇప్పుడు మళ్లీ మరో మందుపాట లాంటిది బాలయ్య బాబు ఆలపించేసారట. పూరిజగన్నాధ్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా కోసం ...' మావా ఏక్ పెగ్ లావో.' అనే పాటను బాలయ్య ఆలపించాడట.

బాలయ్యకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. విదేశాలకు వెళ్లినపుడు వేదికల మీద ఆయన చాలా పాటలు పాడిన సందర్భాలు వున్నాయి. ఇప్పుడు సినిమాల్లోనే నేరుగా పాడేసారన్నమాట. అనూప్ రూబెన్స్ ఓ మాంచి ట్యూన్ ని బాలయ్య చేత పాడించేసారట. భాస్కర భట్ల రచించిన పాటను బాలయ్య ఫ్రొఫెషనల్ సింగర్ రేంజ్ లో ఆలపించేసారని పూరిజగన్నాధ్ మురిసిపోతున్నారు. మొత్తానికి పూరి ఇన్నాళ్లకు బాలయ్య కోరిక తీర్చేసాడన్న మాట.

Show comments