'బాహుబలి' బద్దలుగొట్టడానికి ఇంకేమున్నాయ్‌.?

'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమా కుప్పలు తెప్పలుగా రికార్డుల్ని సొంతం చేసుకుంది. తొలి రోజు, తొలి వీకెండ్‌, తొలి సోమవారం, తొలి వారం, రెండో వారం.. ఇలా రోజుకో రికార్డు బద్దలయ్యింది. సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తూనే వుంది. తెలుగు వెర్షన్‌ది ఓ సంచలనం. హిందీ వెర్షన్‌ది మరో సంచలనం. ఓవరాల్‌గా ఇంకో అద్భుతం. ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్ళను దాటేసింది 'బాహుబలి ది కంక్లూజన్‌'. 

ఇక, బద్దలుగొట్టడానికి ఇంకేమీ లేవు.. అంతా సరికొత్తగా సృష్టించే రికార్డులే.. అని అంతా అనుకుంటున్న టైమ్‌లో, తాజాగా 'బాహుబలి ది కంక్లూజన్‌' మరో రికార్డుని బద్దలుగొట్టింది. 'దంగల్‌' ఓవరాల్‌ వసూళ్ళ 'నెట్‌' 387 కోట్లపైన వుండగా, ఆ రికార్డ్‌ని ఇప్పుడు 'బాహుబలి ది కంక్లూజన్‌' కొల్లగొట్టేసింది. 14 రోజుల్లోనే 390.25 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. 

అన్ని భాషల్లో కలుపుకుంటే, 'బాహుబలి ది కంక్లూజన్‌' వసూళ్ళు 1250 కోట్ల పై మాటే. ఈ ఫిగర్‌ని టచ్‌ చేయడం అంత వీజీ కాదు ఏ సినిమాకి అయినా. ప్రస్తుతానికి 1250 కోట్ల వద్ద వున్న 'బాహుబలి ది కంక్లూజన్‌' పని అప్పుడే అయిపోలేదు. వీకెండ్‌ వచ్చేసింది. మళ్ళీ 'బాహుబలి ది కంక్లూజన్‌' బాక్సాఫీస్‌ వద్ద ఓ మోస్తరుగా కుమ్మేసే అవకాశముందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

Readmore!
Show comments