పవన్‌ సేఫ్‌ గేమ్‌ విడిచిపెట్టాలిక

పవన్‌కళ్యాణ్‌ సినిమాలంటే ఒకప్పుడు వైవిధ్యానికి పెద్ద పీట వేసేవి. వరుస పరాజయాలతో పదకొండేళ్ల పాటు ఇక్కట్లు పడ్డ పవన్‌ 'గబ్బర్‌సింగ్‌'తో మళ్లీ కుదురుకున్నాడు. ఆ సినిమా హిట్‌ అయ్యేసరికి తన చిత్రాలు విజయవంతం కావాలంటే ఏమి వుండాలో అర్థమైపోయిందన్నట్టు పవన్‌ ఇప్పుడు గబ్బర్‌సింగ్‌ ఫార్ములా ఫాలో అవుతున్నాడు. 

ఫాన్స్‌ని మెప్పించే అంశాలు పెట్టుకుంటే తన సినిమాలు ఆటోమేటిగ్గా ఆడేస్తాయనే భ్రమతోనే 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' తీసాడు. మాస్‌ ఎలిమెంట్స్‌, ఫైట్స్‌, ఇక తన మేనరిజమ్స్‌ వుంటే చాలని పవన్‌ అనుకున్నాడు. కానీ ఏ సినిమాకైనా కథ, కథనం బాగుంటేనే మిగతా హంగుల వల్ల రేంజ్‌ పెరుగుతుందనే లాజిక్‌ మర్చిపోయాడు.

'వీరమ్‌' చిత్రాన్ని రీమేక్‌ కూడా పవన్‌ సేఫ్‌ గేమ్‌లో భాగమే. 'కాటమరాయుడు' అంటూ మరోసారి ఫాన్స్‌ని, మాస్‌ని దృష్టిలో పెట్టుకుని సేఫ్‌ సినిమా చేయాలనే ప్రయత్నం చేసారు. కానీ నేటితరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమా వుందా, లేదా అనేది గుర్తించలేదు. ఇకనైనా హంగులు, ఆర్భాటాలు వదిలేసి కథ, కథనాల మీద పవన్‌ దృష్టి పెట్టినట్టయితే తన స్టార్‌ పవర్‌ ఇలా వృధా అవకుండా వుంటుంది.

Show comments