బన్నీకి విశాల్ శేఖర్

విశాల్ శేఖర్..బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ల ద్వయం. పదేళ్ల తరువాత మళ్లీ ఈ పేరు టాలీవుడ్ లో వినిపించే అవకాశం కనిపిస్తోంది. బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన మ్యూజిక్ డైరక్టర్లు ఎప్పుడో 2007లో వెంకీ సినిమా చింతకాయల రవి కి పనిచేసారు. ఆ ఆల్బమ్ అప్పట్లో మంచి హిట్. కానీ తరువాత ఎందుకనో తెలుగువారు ఎవరూ వాళ్లని ట్రయ్ చేయలేదు. హిట్ అనిపించుకుంటే చాలు మార్చి మార్చి అవే ట్యూన్ లు ఇచ్చినా చల్తా అనుకునే మన మ్యూజిక్ డైరక్టర్లు కొందరు మనకున్నారు అని సరిపెట్టుకుంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు ఫర్ ఏ ఛేంజ్ గోపీ సుందర్ లాంటి వాళ్లను ట్రయ్ చేస్తున్నారు.

అయితే అల్లు అర్జున్ ఇప్పుడు మరోసారి విశాల్ శేఖర్ ను తన సినిమా ద్వారా టాలీవుడ్ కు తీసుకురావాలని ఆలోచిస్తున్నాడట. విశాల్ శేఖర్ లకు ఏ మాత్రం డేట్ లు, టైమ్ సెట్ అయితే వక్కంతం వంశీతో తాను చేయబోయే సినిమాకు ఫిక్స్ చేయాలని అనుకుంటున్నాడట. కాస్త డిఫరెంట్ మ్యూజిక్, డిఫరెంట్ ట్యూన్ లు వినే అవకాశం మనవాళ్లకు దక్కుతుందా? లేదా రొటీన్ మాస్ బీట్ లు వింటూ, అవే సూపర్ అనుకునే వాళ్లకు ఈ డిఫరెంట్ ట్యూన్ లు ఎక్కవా? వెయిట్ అండ్ సీ.

Show comments