ఆదా శర్మ 'కాకుల' గోల

హీరోయిన్‌ ఆదా శర్మ ప్రస్తుతం ఖాళీగానే వుంది. నిన్న మొన్నటిదాకా 'కమాండో 2' సినిమా ప్రమోషన్స్‌లో క్షణం తీరిక లేకుండా గడిపేసిన ఆదా శర్మ, ఖాళీ దొరకడంతో, ఫ్రెండ్స్‌తో 'సెలవుల్ని' ఎంజాయ్‌ చేస్తోంది. తన ఫ్రెండ్స్‌ లిస్ట్‌లోకి కుక్కల్నీ, కాకుల్ని కూడా చేర్చేసిందండోయ్‌ ఈ 'హార్ట్‌ ఎటాక్‌' భామ. 'పెటా' తరఫున ఏదో హడావిడి చేయాలనుకుంటోన్న ఈ బ్యూటీ, ఆ పేరు చెప్పి, తన గ్లామర్‌ని ఎడా పెడా ఆరబోసేస్తోంది. 

ఇక, అసలు విషయానికొస్తే, కాకులతో సెల్ఫీలు దిగుతూ, ఆదా శర్మ సోషల్ మీడియాలో చేస్తోన్న హడావిడి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అక్కడితో ఆగితే ఆమె ఆదా శర్మ ఎందుకు అవుతుంది.? 'రెడీ స్టార్ట్‌ కెమెరా..' అంటూ కాకులకి క్లాస్‌ తీసుకుంటోంది. కాకుల్ని గ్లామరస్‌గా ఫొటోలు కూడా తీసేసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేస్తోంది. సోషల్ మీడియా వున్నదెందుకు.? ఇలాంటి పబ్లిసిటీ జిమ్మిక్కులు చెయ్యడానికే కదా.. అంటారా, అలాగైతేనే ఇక, అనుకోవడానికేముంటుందట.

అన్నట్టు, అందాల భామలు ఏం చేసినా, అందులో గ్లామర్‌ వుండాలి కదా.! అందుకే, ఇలా తన క్లీవేజ్‌ అందాల్ని కూడా పనిలో పనిగా కవర్‌ చేసేస్తోంది ఆదా శర్మ. మొన్నీమధ్యనే 'స్ట్రీట్‌ డాగ్స్‌'ని ప్రేమగా నిమురుతూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు కాకుల మీద పడింది. 'పెటా' పేరు చెప్పి, జంతువులు - పక్షుల మీద ప్రేమ చూపించొచ్చుగానీ, ఈ పబ్లిసిటీ స్టంట్లు ఏంటి బేబీ.!

Show comments