సూపర్‌ స్టార్‌ 'ఐటమ్‌ బాంబ్‌'

ఈ సినిమాతో నేను 'సూపర్‌ స్టార్‌ ఐటమ్‌ బాంబ్‌' అయిపోతానంటూ 'రయీస్‌' సినిమాపై హాటెస్ట్‌ కామెంట్‌ చేసింది పోర్న్‌స్టార్‌ టర్న్‌డ్‌ బాలీవుడ్‌ భామ సన్నీలియోన్‌. 'రయీస్‌' సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేస్తోన్న సన్నీలియోన్‌, ఆ సినిమాలోని తన లుక్‌ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఆల్రెడీ సినిమా ప్రోమోలో సన్నీలియోన్‌ కన్పించిన విషయం విదితమే. 

ఇక, సన్నీలియోన్‌ విడుదల చేసిన స్టిల్‌ కెవ్వు కేక.. అనే రేంజ్‌లో వుందన్నది నిర్వివాదాంశం. అఫ్‌కోర్స్‌.. గతంలో సన్నీలియోన్‌ నటించిన సినిమాలతో పోల్చితే, ఇది మరీ టూమచ్‌ హాట్‌ అనేలా లేదనుకోండి.. అది వేరే విషయం. అయినాసరే, సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌.. వెరీ వెరీ స్పెషల్‌ కదా. ఆ 'స్పెషల్‌' అనే సన్నీలియోన్‌ ఉబ్బితబ్బిబ్బవుతోంది. 

అన్నట్టు, సన్నీలియోన్‌ కూడా ఐటమ్‌ సాంగ్‌ని ఐటమ్‌ సాంగ్‌ అనొద్దంటోంది. అది స్పెషల్‌ సాంగ్‌ అట. తనను ఐటమ్‌ బాంబ్‌ అనడం కన్నా, 'నటి' అంటే ఎక్కువ హ్యాపీనెస్‌ ఫీలవుతుందట. నిన్న మొన్నటిదాకా 'అవును నేను హాట్‌ ఐటమ్‌ బాంబ్‌నే.. సెక్స్‌ బాంబుని కూడా.. అంతెందుకు, నేను పోర్న్‌స్టార్‌ని కూడా..' అంటూ 'బోల్డ్‌' టాక్‌లో గుస్సా అయిన సన్నీలియోన్‌, ఇప్పుడిలా షడెన్‌గా రూట్‌ ఎందుకు మార్చిందో.! 

ఏదిఏమైనా, 'రయీస్‌' సినిమాలో సన్నీలియోన్‌ ఐటమ్‌ సాంగ్‌ దుమ్ము రేపేయనుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఈ విషయాన్ని షారుక్‌ స్వయంగా వెల్లడించడం విశేషమిక్కడ.

Show comments