ఎన్టీఆర్-దేవీశ్రీ ఫిక్స్!

నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్  సినిమాలతో ఎన్టీఆర్ కు మాంచి ఆల్బమ్ లు ఇచ్చిన మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ మరో మాంచి ఆల్బమ్ కు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ తో ఆయన హ్యాట్రిక్ కొట్టేందుకు రంగం రెడీ అవుతోంది. 

ఎన్టీఆర్-బాబి కాంబినేషన్ లో కళ్యాణ్ రామ్ నిర్మించే సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరక్టర్ గా ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమాకు అనిరుద్ధ్ ను ఓ ఆప్షన్ గా అనుకున్నారు.అయితే అనిరుద్ధ్ తో అంత స్పీడ్ గా పని తెమలదు. పైగా అతను ఇప్పుడు నాలుగు సినిమాలతో బిజీగా వున్నాడు.

తెలుగులో పవన్-త్రివిక్రమ్ సినిమా చేయాల్సి వుంది. ఇలాంటి టైమ్ లో అతన్నే ఫిక్స్ చేసుకుంటే, తేడా వస్తే, సినిమా లేట్ అయిపోతుందని ఎన్ టి ఆర్ ఆర్ట్స్ యూనిట్ జంకుతోంది. అందుకే ఇప్పటికే రెండు హిట్ లు ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ నే ఫిక్స్ చేసుకుంటున్నట్లు బోగట్టా.

Readmore!
Show comments