అవునన్నా కాదన్నా అవే టైటిల్స్

ఒకసారి మైండ్ ఫిక్స్ అయిపోతే..అంతే. టాలీవుడ్ వ్యవహారం కూడా అలాగే వుంది. మహేష్ బాబు సినిమాకు సంభవామి అని టైటిల్ రిజిస్టర్ చేయించారు. మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది.

బాగుందని, సూపర్ అని అన్నవారు వున్నారు. అభిమానులు అంత జోష్ లేదనీ అన్నారు. కానీ ఇప్పుడు మొత్తానికి అదే ఫిక్స్ అయిన మహేష్-మురగదాస్ సినిమా యూనిట్ ఫిక్సయిపోయిందట. సో, ఇంక దాదాపు మార్పు లేనట్లే.

ఈ సినిమా తాజా షెడ్యూలు అహమ్మదాబాద్ లో దాదాపు పూర్తయింది. తిరిగి హైదరాబాద్ లో కొన్ని రోజులు షూట్ వుంటుంది. ఆపై బెంగుళూరు, అబ్రాడ్ లో కంటిన్యూ అవుతుంది.

అలాగే మారుతి-శర్వానంద్-యువి కాంబినేషన్ సినిమాకు మహానుభావుడు అని టైటిల్ పెట్టారు. దీని మీద కూడా మిక్స్ డ్ రెస్సాన్స్ వుంది. మారుతి సినిమా టైటిళ్ల జోష్ దీనికి అంతగా లేదని టాక్. అయినా కూడా అదే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారట. Readmore!

యువి నిర్మించే ఈ సినిమా జనవరి లాస్ట్ వీక్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో శర్వానంద్ బ్రాండ్ వస్తువులు అంటే పడిపోయే కుర్రాడిగా ఓ కాన్సెప్ట్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. శర్వా సరసన మెహరీన్ నటిస్తోంది.

Show comments