ఆకతాయిల నుంచి సమంత కు మరో చేదు అనుభవం..!

క్రేజీ హీరోయిన్లు జనాల మధ్యకు వస్తే మాబ్ నుంచి ఇక్కట్లు తప్పడం లేదు. వీళ్లను చూడాలని తపిస్తూ మూగే జనాలతో ఒక సమస్య అయితే.. వీళ్లను తాకి శునకానందం పొందే ఆకతాయిలతో మరో సమస్య. ఇది చాలా మంది హీరోయిన్ల కు అనుభవపూర్వకమైన విషయమే. ఇది వరకూ జ్యోతిక, నగ్మా, అసిన్, హెబ్బాపటేల్.. వంటి వాళ్లు ఆకతాయిల బారిన పడ్డారు. 

ఈ హీరోయిన్లను తాకడానికి శతథా ప్రయత్నించి, తాకి తీవ్రంగానే ఇబ్బందులు పెట్టారు ఆకతాయిలు. క్రేజీ హీరోయిన్ సమంతకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఉంది. కొన్నాళ్ల కిందట ఒక చీరల దుకాణం ఓపెనింగ్ కు వెళ్లి అక్కడ ఆకతాయిల బారిన పడింది సమంత. చుట్టుముట్టిన జనసందోహం నుంచి కొంత మంది కుర్రాళ్లు సమంతను గిల్లి, గిచ్చి ఇబ్బందిపెట్టారు. 

అప్పుడు తెలుగునాట ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్న సమంత తాజాగా తమిళనాట ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి మధురై వెళ్లిన సమంతను అక్కడి జనాలు బాగా  ఇబ్బంది పెట్టేశారు. ఈ హీరోయిన్ ను చూడటానికి వారు ఎగబడ్డారు. ఈ క్రమంలో సమంత ఒంటిపై చేతులు వేసి  కొందరు శునకానందం  పొందే యత్నం చేశారు. 

అప్పటికే అక్కడ మొహరించి ఉన్న పోలీసులు సమంతను దగ్గరుండి జనసందోహం నుంచి పక్కకు తీసుకెళ్లారు. జనసందోహం చుట్టుముడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అయిన హీరోయిన్లు రెండోసారి మళ్లీ క్రౌడ్ లోకి రావడానికి వెనుకాడతారు. సమంత మాత్రం అమాయకంగా వచ్చి మరోసారి ఇబ్బంది పడింది పాపం!

Show comments