పూనమ్‌ పాండే.. ఏంటా సీక్రెట్‌.!

సోషల్‌ మీడియా సెన్సేషన్‌ పూనమ్‌ పాండే, సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్‌ చేసింది. 'సీక్రెట్‌ ప్రాజెక్ట్‌ కోసం షూటింగ్‌లో వున్నాను..' అంటూ పోస్ట్‌ చేసిన ఆ ఫొటోతో ఆమె వున్నపళంగా హాట్‌ టాపిక్‌ అయిపోయింది. మామూలుగా అయితే, ఇలాంటి షూటింగ్స్‌ పూనమ్‌ పాండేకి కొత్తేమీ కాదు. సినిమా అవకాశాలు పెద్దగా వుండవుగానీ, సోషల్‌ మీడియాలో తన అందయందాలతొ వీడియోల్ని తానే రూపొందించుకుని, వాటితో ఫాలోయింగ్ పెంచుకోవడం పూనమ్‌ పాండేకి అలవాటే. 

పూనమ్‌ పాండే తాజాగా పోస్ట్‌ చేసిన ఫొటో చుట్టూ రకరకాల గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. ఓ హాట్‌ మూవీకి పూనమ్‌ కమిట్‌ అయ్యిందనీ, ఆ సినిమా కోసమే ఇలా అర్థనగ్నంగా తయారయ్యిందనీ బాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. మరికొందరేమో, ఇవన్నీ పూనమ్‌ పాండే మార్క్‌ చీప్‌ పబ్లిసిటీ జిమ్మిక్స్‌ అని కొట్టి పారేస్తున్నారు. 

మొత్తమ్మీద, పూనమ్‌ పాండేకి నిజంగానే ఏదన్నా సినిమాలో అవకాశమొచ్చినా, నమ్మేటట్లు లేరెవరూ. అందుక్కారణం, ఆమె షరామామూలుగా చేసే పబ్లిసిటీ స్టంట్లే. ఏం చేస్తేనేం, ట్విట్టర్‌ ఈమె గ్లామర్ దెబ్బకి బెదిరిపోయింది.. యూ ట్యూబ్‌ షేక్‌ అయిపోతోంది. ఆమె ఏ ఫొటో పోస్ట్ చేసినా, వీడియో పోస్ట్‌ చేసినా, ఆటోమేటిక్ గా అడల్ట్‌ కంటెంట్‌లోకే వెళ్ళిపోతోంది మరి. ఏం చేసినా, పబ్లిసిటీ కోసమేనని పూనమ్‌ కూడా చెబుతుందనుకోండి.. అది వేరే విషయం.

Show comments