9న మహేష్-కొరటాల సినిమా ఓపెనింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తరువాత సినిమా పూజకు రెడీ అయిపోతున్నారు. మార్చి నుంచి మొదలు అయ్యే కొరటాల శివ సినిమాకు ఇప్పడే క్లాప్ కొట్టించేస్తున్నారు. ఈనెల 9న కొరటాలశివ-మహేష్ బాబు సినిమాకు పూజ నిర్వహిస్తున్నారు. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కార్తీకమాసం మంచి రోజులు అని ఈ నెల 9న ఈ సినిమాకు పూజ నిర్వహిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్. మిగిలిన వ్వవహారాలు అన్నీ స్లోగా ఫైనల్ చేస్తారు.

ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ తయారీలో బిజీగా గడుపుతున్నారు. అందువల్ల వాటి మీద దృష్టి పెట్టలేదు. ఈ సినిమాకు మహేష్ భారీ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు వినికిడి. పాతిక కోట్ల వరకు రెమ్యూనిరేషన్ వున్నట్లు తెలుస్తోంది.

Show comments