ఇంటర్నెట్‌లో బూతు సినిమాలు చూడట్లేదా.?

వామ్మో.. ఓ హీరోయిన్‌ ఇంత బోల్డ్‌గా మాట్లాడేస్తే ఎలా.! దేశమంతా ఇప్పుడు ఆమె గురించే మాట్లాడుకుంటోంది. ఒకే ఒక్క సినిమా.. ఆమెను వార్తల్లో వ్యక్తిగా మార్చేసింది. అదే, 'బాబూమొషాయ్‌ బందూక్‌ రాజ్‌' సినిమా. ఆమె ఎవరో కాదు, బిదితా బాగ్‌. సెన్సార్‌ బోర్డ్‌ 'బాబూమొషాయ్‌..' సినిమాకి 40కి పైగా కట్స్‌ సూచించడంతో దుమారం రేగింది. 

'భారతీయులెవరూ బూతులు మాట్లాడుకోరు..' అంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు వేసిన బిదితా బాగ్‌, ఓ ఇంటర్వ్యూలో 'ఓ విషయం మర్చిపోయా.. భారతీయ పురుషులకు సెక్స్‌ కూడా తెలియదు.. వారికి సెక్స్‌ అవసరం లేదు..' అంటూ బీభత్సమైన డైలాగులు పేల్చింది. ఇంతలా తాను రగిలిపోవడానికి కారణం సెన్సార్‌ బోర్డ్‌ నిర్ణయాలేనని చాలా బోల్డ్‌గా మాట్లాడేసింది బిదితా బాగ్‌. 

'ఇంటర్నెట్‌ ఓపెన్‌ చేస్తే, విచ్చలవిడిగా పోర్న్‌ సినిమాలు అందుబాటులో వుంటాయి.. అవి ఉచితంగా దొరుకుతాయి.. అవి చూసేవారు, మా సినిమా చూడ్డానికి ఎందుకు వస్తారు.? మా సినిమాలో కంటెంట్‌ వుంటేనే దానికి ప్రేక్షకుల ఆదరణ దొరుకుతుంది. ప్రేక్షకులు ఏం చూడాలి.? ఏం చూడకూడదు.? అన్న విషయాన్ని ఎవరూ నిర్ణయించలేరు.. సెన్సార్‌ బోర్డ్‌ సర్టిఫికెట్‌ మాత్రమే ఇవ్వాలి..' అంటూ బిదితా విరుచుకుపడిపోయింది. 

నిజానికి తాను బోల్డ్‌గా మాట్లాడే టైప్‌ కాదనీ, ఆ సినిమాలో వున్న కంటెంట్‌ తనకు నచ్చడం వల్లే ఆ సినిమా చేశాననీ, ప్రాణం పెట్టి చేసిన సినిమాని చంపేయాలని కొందరు కుట్ర పన్నుతోంటే తట్టుకోలేకపోతున్నానని బిదిత ఆవేదన వ్యక్తం చేసింది. 

ఏదిఏమైనా సెన్సార్‌ బోర్డ్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకూ ఓ పద్ధతి వుంది. పచ్చి బూతు సినిమాల్ని తీసి, సెన్సార్‌ కటింగులివ్వొద్దనడమూ సబబు కాదు. పైగా, భారతీయ పురుషులకు సెక్స్‌ అవసరంలేదు.. వారికి సెక్స్‌ అంటే తెలియదు.. అంటూ సెటైర్లు వేయడం ఎంతవరకు సబబో బిదితా బాగ్‌కే తెలియాలి.

Show comments