చెలియా భవిష్యత్తు తేలేది ఈరోజే

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చెలియా సినిమా తెలుగులో ఫ్లాప్ అయింది. తమిళనాట మాత్రం కార్తికి ఉన్న క్రేజ్, మణిరత్నంకు ఉన్న ఫాలోయింగ్ వల్ల కాస్త ఆడుతోంది. అయినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ తో పోల్చిచూస్తే అక్కడ కూడా ఈ సినిమా లాస్ లోనే నడుస్తోంది. ఈ వీకెండ్ కూడా థియేటర్లలో ఉంటే నష్టాలు కొంత తగ్గే అవకాశం ఉంది. కానీ ఈ సినిమాకు తమిళనాట విషమక పరీక్ష ఎదురైంది.

ఈ శుక్రవారం నుంచి చెలియా సినిమాను ఉంచాలా వద్దా అనే అంశంపై థియేటర్ యాజమాన్యాలన్నీ ఈరోజు మీటింగ్ ఏర్పాటుచేశాయి. ఒకవేళ ఈ వీకెండ్ కూడా కాట్రు వెళియదై సినిమాను (అదేనండీ చెలియా సినిమా) కొనసాగించాలంటే ఎన్ని థియేటర్లకు ఆ సినిమాను పరిమితం చేయాలనే అంశంపై కీలకమైన చర్చ జరగనుంది.

చెలియా సినిమాపై ఇంత సడెన్ గా తమిళనాట ఈ డిస్కషన్ ప్రారంభంకావడానికి చాలా పెద్ద రీజనే ఉంది. రాబోయే వీకెండ్, అంటే ఏప్రిల్ 14న కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. పవర్ పాండీ, శివలింగ, కదంబన్ లాంటి భారీ సినిమాలతో పాటు మరికొన్ని మీడియం రేంజ్ సినిమాల థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో తమ సినిమాను వాయిదా వేసుకునేందుకు ఏ ఒక్క ప్రొడ్యూసర్ సిద్ధంగా లేడు. దీంతో థియేటర్ యాజమాన్యాలే కూర్చొని, ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు కేటాయించాలో నిర్ణయించే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈరోజు రాత్రి లేదా రేపు మధ్యాహ్నానికి వీకెండ్ రిలీజెస్ పై  ఓ అవగాహనకు వస్తారు. చెలియాకు ఎన్ని థియేటర్లు మిగిలాయనేది అప్పుడు తెలుస్తుంది.

Show comments