ఇక్కడ ఎన్టీఆర్‌.. అక్కడ మోహన్‌లాల్‌

'జనతా గ్యారేజ్‌' సినిమా టీజర్‌ ఇటీవలే విడుదలైంది. భారీ అంచనాలున్న సినిమా కావడంతో టీజర్‌ విడుదలైన కాస్సేపటికే టీజర్‌ విపరీతమైన స్పందనను రాబడ్తోంది. ఇంకోపక్క, ఈ సినిమా మలయాళ వెర్షన్‌ టీజర్‌ కూడా విడుదలై, అక్కడా సంచలనాల్ని నమోదు చేస్తోంది. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ 'జనతా గ్యారేజ్‌'లో నటిస్తుండడమే ఇందుకు కారణం. 

తెలుగు టీజర్‌లో సహజంగానే ఎన్టీఆర్‌ మీద ఎక్కువ ఫోకస్‌ వుండాలి. తప్పదు. మలయాళంలో అలా కాదు కదా. అందుకే అక్కడ మోహన్‌ లాల్‌ మీద ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. మోహన్‌లాల్‌ వాయిస్‌తో టైటిల్‌, కింద క్యాప్షన్‌ చెప్పించారు. అంతేనా, విలన్స్‌ని మోహన్‌లాల్‌ తన్నుతోన్న సీన్‌ని కూడా అదనంగా వుంచారు మలయాళ టీజర్‌లో. మలయాళంలో ఎన్టీఆర్‌ డైలాగులేం లేవు. 

Watch Janatha Garage Teaser

'మిర్చి' సినిమాతో తమిళనాటుడు సత్యరాజ్‌ని తొలిసారిగా పవర్‌ఫుల్‌ రోల్‌లో చూపించినా, ప్రభాస్‌ హీరోయిజంని ఏమాత్రం తగ్గించలేదు దర్శకుడు కొరటాల శివ. తండ్రిని మించిన తనయుడిగా 'మిర్చి'లో ప్రభాస్‌ పాత్ర వుంటుంది. ఇక, ఈ 'జనతా గ్యారేజ్‌'లోనూ మోహన్‌లాల్‌, ఎన్టీఆర్‌ పాత్రల్ని అదేలా కొరటాల శివ డిజైన్‌ చేసి వుంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! Readmore!

మొత్తమ్మీద, మలయాళంలో మోహన్ లాల్, ఇక్కడ ఎన్టీఆర్ ’జనతా గ్యారేజ్‘ టీజర్ తో దుమ్ము రేపేస్తున్నారన్నమాట.

Show comments

Related Stories :