బాలయ్యను కాపాడింది నిజమే

మొత్తానికి ఏళ్లు గడిచిన తరువాత ఓ నిజం బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చి ఏం లాభం. అంతా సర్దుకుపోయిన తరువాత. నిర్మాత, మరికరిపై కాల్పుల  కేసుకు సంబంధించి హీరో బాలకృష్ణను తానే కాపాడానని, అప్పటి నిమ్స్ ఉన్నతాధికారి కాకర్ల సుబ్బారావు బహిరంగంగా చెప్పారు. అది కూడా టీవీ టాక్ షో లో. బాలకృష్ణను మీరు కాపాడారని అంటారు, అది నిజమేనా అని అడిగితే, ఆయన మరో మాటకు చాన్స్ లేకుండా అవును అని చెప్పేసారు.

ఇద్దరు సైక్రియాట్రిస్ట్ లను తీసుకెళ్లి తానే చూపించానని, అసలు తనకు తప్ప, మరొకరికి ఈ ఐడియా తట్టి వుండేదే కాదని కాకర్ల సుబ్బారావు చెప్పారు. అంటే మరి దీని అర్థం ఏమనుకోవాలి. ఈ ఎత్తుగడ తనదే అని, ఆ విధంగా బాలకృష్ణను సేవ్ చేసాననే కదా? ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని, ఎవరయినా, కేసును తిరిగి విచారించాలని కోరితే మన న్యాయస్థానాల్లో అవకాశం వుంటుందా? న్యాయ నిపుణులకే తెలియాలి. ఓ వైద్య సంస్థ అధికారే తానే ఇలా చేసానని ఇన్నేళ్ల తరువాత చెప్పడం అంటే ఏమనుకోవాలి? ఈ దేశంలో అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ చెట్టాపట్టాలు వేసుకుని వుంటాయని మాత్రం అనుకోవాలి.

Show comments