మెహరీన్ అప్పుడే అంత డిమాండ్ నా?

హీరోయిన్ మెహరీన్ నటించి, విడుదలైంది ఒక్క సినిమా. కృష్ణగాడి వీర ప్రేమగాథ. అయితే ప్రొడక్షన్ లో నాలుగైదు సినిమాల వరకు వున్నాయి. ఓ బాలీవుడ్ సినిమా, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ, అల్లు శిరీష్ ఇలా. ఇప్పుడు శర్వానంద్ పక్కన మారుతి డైరక్షన్ లో యువి సంస్థ నిర్మించే మరో సినిమాకు ఆమె డేట్లు అడిగారు. 

దీంతో ఆమె రేటును అప్పుడే నలభై లక్షలకు చేర్చేసినట్లు తెలుస్తోంది. కొత్త హీరోయిన్లు, కాస్త పాపులర్ అయ్యే వరకు పాతిక దాటడం అంటే కాస్త టైమ్ పడుతుంది. అలాంటిది మెహరీన్ ఒక్క సినిమా ఐడెంటిటీతోనే నలభై అడిగేసరికి, బేరాలు మొదలైనట్లు వినికిడి. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఇలాంటి డిమాండ్ లకు దారితీస్తున్నట్లుంది.

Show comments