మంచి సినిమా అన్న టాక్ వస్తే అంతే, జనం నెత్తిన పెట్టేసుకుంటారు. తేడా వచ్చిందో పక్కన పెడతారు. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా విడుదలై ఇరవై రోజులు అయిపోయింది. అయినా దాని హవా తగ్గడం లేదు. ఈవారం విడుదల అయిన భేతాళుడు, మన్యంపులి సినిమాల కన్నా చిన్నవాడే ఎక్కువ వసూళ్లు సాధించడం విశేషం.
భేతాళుడు కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి కానీ, ఆ తరువాత కాస్త ట్రబుల్ స్టార్ట్ అయింది. మన్యం పులికి మంచి టాక్ వచ్చింది. బిసిల్లో బాగుంది. కానీ ఎక్కడికిపోతావు చిన్నవాడా ఈ రెండింటికన్నా మంచి కలెక్షన్లు తెచ్చుకోవడం విశేషం. ఇప్పటికి ఓవర్ సీస్, రెస్టాఫ్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణ కలిపి 20 కోట్ల షేర్ దిశగా నడుస్తోంది.
సినిమా విడుదలయిన తొలివారం 15 కోట్లు చేయవచ్చని అంచనావేసారు. కానీ ఇప్పుడు ఇది ఆ అంచనాలను దాటి ముందుకువెళ్తోంది.