పిచ్చ ప్రాఫిట్ ఇచ్చేసాడు కుర్రాడు

రాజ్ తరుణ్ సినిమా అంధగాడు ఈవారం విడుదలవుతోంది. మెగా మీడియం హీరోల సినిమాలు అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతోంటో, విన్నర్, మిస్టర్ లాంటివి కోట్ల నష్టాలు నిర్మాతలకు మిగిలిస్తే, నిఖిల్, రాజ్ తరుణ్ లాంటి, ఏ సపోర్ట్ లేని మీడియం హీరోల సినిమాలు లాభాలు పండిస్తున్నాయి. నిన్నటికి నిన్న కేశవ సినిమా విడుదలకు ముందే నిర్మాతకు లాభాలు తెచ్చింది. ఫస్ట్ వీక్ లో ఏడు కోట్లకు పైగా షేర్ సాధించి, డిస్ట్రిబ్యూటర్లకు కూడా ధైర్యం ఇచ్చింది.

ఇక ఈవారం విడుదల కాబోయే రాజ్ తరుణ్ అంధగాడు కూడా విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలు పండించింది. మొత్తం ప్రచారంతో సహా ఏడు కోట్లలో ఫినిష్ చేసారు ఈ సినిమాను. శాటిలైట్(2.70) తో కలిపి 11 కోట్లకు మార్కెట్ చేసారు. అంటే హ్యాపీగా నాలుగు కోట్లు లాభం అన్నమాట.

రాజ్ తరుణ్ తో ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ మూడు సినిమాలు చేసింది. వీడో రకం, ఆడో రకం, కిట్టూగాడు వున్నాడు జాగ్రత్త, అంధగాడు. మూడు సినిమాలూ లాభాలు తెచ్చాయి. అందులో అంధగాడు అన్నింటికన్నా ఎక్కువ తెచ్చాడు.

Show comments