బన్నీ-వక్కంతం పనులు షురూ

ఎన్టీఆర్ తో ఎప్పటికైనా సినిమా డైరక్ట్ చేయాలని వెయిట్ చేసి, చేసి బయటకు వచ్చేసాడు రైటర్ వక్కంతం వంశీ. రావడం, రావడం నేరుగా బన్నీ దగ్గరకు వెళ్లిపోయాడు. కథ విని బన్నీ ఓకె చేసేసాడు. కానీ సినిమా ఎప్పుడు వుంటుందా అన్న క్లారిటీ లేదు ఇన్నాళ్లు. అయితే ఇప్పుడు ఆ క్లారిటీ కనిపిస్తోంది.

ఎందుకంటే బన్నీ తో తన సినిమాకు సంబంధించి వక్కంతం వంశీ ప్రీ ప్రొడక్షన్ పనులకు శ్రీకారం చుట్టేసాడు. లోకేషన్లు, కాస్టింగ్, షెడ్యూళ్లు తదితర వ్యవహారాలను గీతాలో కూర్చుని చక్క బెట్టడం ప్రారంభించేసారు. అంటే ప్రస్తుతం డిజె సినిమా చేస్తున్న బన్నీ తన తరువాతి ప్రాజెక్టుగా వక్కంతం వంశీ సినిమా చేస్తాడేమో అన్న డౌట్ వస్తోంది. కానీ లింగు స్వామి డైరక్షన్ లో తమిళ,తెలుగు బై లింగ్యువల్ ఒకటి చేయాలి.

మరి అది చేయకుండా వక్కంతం వంశీ సినిమా చేస్తాడా? అని అనుమానం. అయితే లింగు స్వామికి కూడా హీరో విశాల్ తో ఓ సినిమా కమిట్ మెంట్ వుంది. అందువల్ల బన్నీకి గ్యాప్ వచ్చేలాగే వుంది. ఆ గ్యాప్ లోనే వక్కంతం వంశీ సినిమా చేసేలాగే వున్నాడు. బహుశా అందుకే కావచ్చు, వంశీ ఇప్పటి నుంచే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేసాడు.

Show comments