పిక్‌ టాక్‌: 'రాజు'గారి యంగ్‌ లుక్‌

నాగార్జునంటే నాగార్జునే.. తెలుగు సినీ పరిశ్రమకి 'మన్మథుడు' ఎవరంటే, ఖచ్చితంగా నాగార్జున పేరే చెప్పాలి. వయసు మీద పడ్తున్నా, నాగార్జునలో ఆ వయసు మీద పడ్డ ఛాయలు కన్పించడంలేదు సరికదా.. నవ యువ మన్మథుడిలా కన్పిస్తున్నాడాయన. పాండిచ్చేరిలో 'రాజుగారిగది-2' సినిమా షూటింగ్‌ సందర్బంగా కొన్ని స్టిల్స్‌ని నాగార్జున, ఇప్పటికే సోషల్‌ మీడియాలో వుంచిన విషయం విదితమే. 57 ఏళ్ళ వయసులో నాగ్‌.. ఏంటీ హ్యాండ్సమ్‌ లుక్‌.? అని అంతా ఆశ్చర్యపోయారు. 

తాజాగా, పాండిచ్చేరి షూటింగ్‌ పూర్తి చేసుకుని హైద్రాబాద్‌కి పయనమైన విషయాన్ని తెలుపుతూ సోషల్‌ మీడియాలో మరికొన్ని ఫొటోల్ని పోస్ట్‌ చేశాడు నాగ్‌. వాటిల్లో హీరోయిన్‌ సీరత్‌కపూర్‌తో నాగ్‌ కలిసి వున్న ఫొటో అయితే, నాగార్జున హ్యాండ్సమ్‌ లుక్‌ని ఇంకా బాగా ఎలివేట్‌ చేసింది. సీరత్‌ ఈ జనరేషన్‌ హీరోయిన్‌.. నాగార్జున వయసేమో 57 ఏళ్ళు.. ఫొటో చూస్తే, ఆ గ్యాప్‌ అస్సలేమీ కన్పించట్లేదు.. దటీజ్‌ నాగార్జున. 

ఇక, 'రాజుగారిగది-2' సినిమా విషయానికొస్తే, ఓంకార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సమంత ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కన్పించనుంది.

Show comments