ఫిదా క్లైమాక్స్.. ఆ సీన్ దిల్ రాజు చెప్పాడట!

సినిమాలు జడ్జ్ చేయడంలో, తన సినిమాల్ని ట్రిమ్ చేయడంలో దిల్ రాజు దిట్ట. ఏ దర్శకుడు తీసిన సినిమాలకైనా చివర్లో తనదైన టచ్ ఇవ్వందే ఈ నిర్మాతకు నిద్రపట్టదు. కమ్ముల తీసిన ఫిదాలో కూడా ఓ చేయి వేశాడు దిల్ రాజు. దాదాపు ఓ 10 నిమిషాల సినిమా లేపేశాడు. ఇదంతా కామన్. అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఓ హార్ట్ టచింగ్ సీన్ ను మాత్రం కేవలం దిల్ రాజు సలహాతోనే పెట్టారట.

తొలిప్రేమ సినిమా గుర్తుందా.. అందులో ఆఖర్లో హీరోయిన్ పరుగెత్తుకుంటూ వచ్చి హీరోను హత్తుకుంటుంది. సేమ్ టు సేమ్ అదే సీన్ ఫిదాలో కూడా రిపీట్ అయింది. నిజానికి ఈ సీన్ కంటే ముందే క్లైమాక్స్ రాసుకున్నాడు కమ్ముల. కానీ దిల్ రాజు దగ్గరుండి మరీ ఈ సీన్ పెట్టించాడట. కచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతుంది పెట్టమని కమ్ములకు చెప్పాడట. 

ప్రెస్ మీట్స్ లో కూడా దిల్ రాజు నోట ఎప్పుడూ ఒకటేమాట. వరుణ్ తేజ్ కు ఇది మరో తొలిప్రేమ అవుతుందని చెబుతూ వచ్చాడు. దానికి కారణం ఫిదాలో ఎయిర్ పోర్ట్ సీన్. అంతా బాగానే ఉంది. ఫిదా బాగుంది. కమ్ములకు పేరొచ్చింది. దిల్ రాజుకు పైసలొస్తాయి. సాయి పల్లవికైతే ఫుల్ మార్కులు. మరి వరుణ్ తేజ్ పరిస్థితేంటి? అతడి కెరీర్ కు ఇది నిజంగా "తొలిప్రేమ" అవుతుందా? వెయిట్ అండ్ సీ..

Show comments