సినిమా ఓకే చేశారు కానీ పేరు చెప్పలేదు

అల్లు అర్జున్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు అల్లు అర్జున్ కొత్త సినిమా దువ్వాడ జగన్నాథమ్-డీజే నుంచి ఓ స్టిల్ రిలీజ్ చేశారు. దీంతోపాటు బన్నీ చేయబోయే నెక్ట్స్ సినిమాను కూడా పక్కా చేశారు. వక్కంతం వంశీ డైరక్షన్ లో అల్లు అర్జున్ చేయబోయే సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. కాకపోతే టైటిల్ మాత్రం చెప్పలేదు.

వక్కంతం డైరక్షన్ లో రామలక్ష్మీ సినీక్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాణంలో బన్నీ నెక్ట్స్ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" అనే టైటిల్ పెడుతున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆ టైటిల్ పెడుతున్నారా లేదా అనే క్లారిటీని మాత్రం యూనిట్ ఇవ్వలేదు. 

టైటిల్ ఎనౌన్స్ చేయనప్పటికీ మ్యూజిక్ డైరక్టర్ పై మాత్రం యూనిట్ క్లారిటీ ఇచ్చింది. బన్నీ-వక్కంతం సినిమాకు బాలీవుడ్ విశాల్-శేఖర్ సంగీతం అందించనున్నారు. వెంకటేష్ హీరోగా అప్పుడెప్పుడో వచ్చిన చింతకాయల రవి సినిమాకు సంగీతం అందించిన వీళ్లిద్దరూ.. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మరో తెలుగు సినిమా చేయబోతున్నారు. నాగబాబు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తారు.

Show comments