రాధికా.. ఎందుకిలా.?

దక్షిణాది సినీ పరిశ్రమపై అత్యంత దారుణమైన ఆరోపణలు చేసింది బాలీవుడ్‌ హీరోయిన్‌ రాధికా ఆప్టే. దక్షిణాదిలో ఆమె నాలుగైదు సినిమాల్లో నటించింది. వీటిల్లో మూడు స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలు. ఇంకో రెండు తమిళ సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. 'రక్తచరిత్ర', 'ధోనీ', 'కబాలి', 'లెజెండ్‌', 'లయన్‌' చిత్రాల్లో రాధికా ఆప్టే నటించిన విషయం విదితమే. 

తనను దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ హీరో దారుణంగా అవమానించారనీ, లైంగిక వేధింపులకు గురిచెయ్యాలనుకున్నారంటూ రాధికా ఆప్టే చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలు షాక్‌కి గురయ్యాయి. ఇదిప్పటి మాట కాదు. చాన్నాళ్ళ క్రితం జరిగినవే. అప్పటినుంచీ పలు సందర్భాల్లో రాధికా ఆప్టే ఈ విషయాల్నే మళ్ళీ మళ్ళీ తెరపైకి తెస్తోంది. 'ఓ ప్రముఖ హీరో..' అంటూ పరోక్షంగా టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ హీరో పేరు చెప్పకుండానే, ఆ హీరో పేరు జనానికి అర్థమయ్యేలా మాట్లాడుతోంది రాధికా ఆప్టే. 

నిజంగానే, రాధికా ఆప్టేకి ఆ స్థాయిలో లైంగిక వేధింపులు జరిగి వుంటే, ఆమె ఈపాటికే సదరు హీరో పేరు చెప్పి వుండేదే. కానీ, రాధికా ఆప్టే జస్ట్‌ పబ్లిసిటీ స్టంట్స్‌తో సరిపెట్టేస్తోంది. ఇలా చేయడం ద్వారా తనపై సింపతీ పెరుగుతందని ఆమె అనుకోవచ్చుగాక. 'పర్చేద్‌' సినిమాలో నగ్నంగా నటించి వివాదాలు ఎదుర్కొంటోన్న రాధికా ఆప్టే, ఆ వివాదం నుంచి తప్పించుకునేందుకు, ఇదిగో ఇలా.. సౌత్‌ సినీ పరిశ్రమని, మరీ ముఖ్యంగా టాలీవుడ్‌నీ ఆమె అవమానిస్తోందన్నది నిర్వివాదాంశం. 

Show comments