ఒక్క హీరో ఖాళీగా వుంటే ఒట్టు

ఒక్కసారిగా టాలీవుడ్ ఫుల్ బిజీ అయిపోయింది. ఒక్క హీరో అంటే ఒక్కరు ఖాళీ లేరు. అందరికీ చేతినిండా పనే. ఎవ్వరికీ కూడా నో షాపింగ్, నో ఎంటర్ టైన్ మెంట్. నో రిలాక్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తరువాతి సినిమా సెట్ మీదకు వచ్చేసారు. ఎన్టీఆర్ షూట్ లోనే వున్నారు. రామ్ చరణ్ ఈస్ట్ లో సుకుమార్ సినిమాలో వున్నారు. మహేష్ బాబు తన స్పయ్ డర్ ఫినిష్ చేసే పనిలో ఫుల్ బిజీ. బన్నీ తన డిజె సినిమాను నైట్ అండ్ డే కొడుతున్నారు. 

నాగార్జున రాజుగారి గది 2 పూర్తి చేసే పనిలో వున్నారు. అది అయిపోతే, బంగార్రాజు స్టార్ట్ చేయాలి. అఖిల్ లాంగ్ గ్యాప్ తరువాత విక్రమ్ కుమార్ సినిమాకు వచ్చేసారు. నాగ్ చైతన్య కళ్యాణ్ కృష్ణ సినిమాతో, సాయి కొర్రపాటి సినిమాతో ఫుల్ బిజీ. వచ్చేనెల చందు మొండేటి సినిమా స్టార్ట్ చేసే అవకాశం వుంది. వరుణ్ తేజ మిస్టర్ ఫైనల్ సాంగ్ లో వున్నారు.ఇది అయిపోతే ఫిదా ఫినిష్ చేసేయాలి.

బాలయ్య బాబు తన పూరిజగన్నాధ్ సినిమాకు జస్ట్ వన్ టు డేస్ విరామం ఇచ్చారు. తరువాతి షెడ్యూలు రెడీ అయిపోతోంది. ప్రభాస్ బాహుబలి ప్రమోషన్లు ఒక పక్క తరువాతి సినిమా ప్రీప్రొడక్షన్లు మరో పక్క చకచకా కానిచ్చేస్తున్నారు. శర్వానంద్, నాని, సాయి ధరమ్, రాజ్ తరుణ్ చేతిలో ఒకటికి రెండు ప్రాజెక్టులతో చకచకా సాగిపోతున్నారు. నిఖిల్ కిర్రాక్ పార్టీ ప్రీ పొడక్షన్ పనులు, తెలుగు అడాప్ట్ పై దృష్టి పెట్టారు. సునీల్ ఒకపక్క ఉంగరాలరాంబాబు డబ్బింగ్ మరో పక్క ఎన్ శంకర్ టూ కంట్రీస్ షూటింగ్. విష్ణు మంచు ఆచారి అమెరికా యాత్రతో బిజీ బిజీ. విజయ్ దేవర కొండ రెండు కొత్త సినిమాలు స్లయ్ మెంటేనియస్ గా షూట్ లో వున్నారు. నాగశౌర్య ఈ నెలలో స్వంత సినిమా ప్రారంభిస్తున్నారు. కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ కొత్త ప్రాజెక్టులు సెట్ చేసుకునే పనిలో వున్నారు.

Show comments