అనిత.. ఆకర్షణీయమైన నటి. దాదాపు ఒకటిన్నర దశాబ్దం కిందట కెరీర్ మొదలుపెట్టిన అనిత తెలుగులో కెరీర్ ఆరంభంలో మంచి విజయాలే సొంతం చేసుకుంది. నాటి యువహీరోల సరసన వరస పెట్టి అవకాశాలు సంపాదించింది. అయితే.. టాప్ హీరోల సరసన నటించే అవకాశాలు పొందలేకపోయింది అనిత. అయితే వచ్చిన చిన్న చిన్న అవకాశాలను కూడా వదులుకోకుండా ఆమె సద్వినియోగం చేసుకుంటోంది.
కొంత కాలం కిందట ఒక తెలుగు వ్యక్తినే పెళ్లి చేసుకున్న అనిత అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. ఇంతకన్నా ఈమె హిందీ సీరియల్స్ లో నటిస్తోంది.
హిందీ టీవీ ఆర్టిస్టుగా అనిత మంచి డిమాండ్ మీద ఉంది, చాలా సంవత్సరాల నుంచి వివిధ సీరియల్స్ లోనటిస్తూ వస్తున్న అనిత ఇప్పుడు హిందీ సీరియల్ ఇండస్ట్రీలో భారీ పారితోషకం పొందుతున్న తారల్లో ఒకరిగా నిలుస్తోంది. ప్రస్తుతం అనిత ఒక్కో ఎపిసోడ్ కు యాభై వేల రూపాయల రెమ్యూనరేషన్ పొందుతోందని సమాచారం.
సీరియల్స్ అంటే అవి సంవత్సరాలకు సంవత్సరాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ రంగంలో అనిత బాగా స్టాండ్ అయ్యింది కాబట్టి.. ఉపాధికి లోటు ఉండదు. హిందీ టీవీ షోల ఇండస్ట్రీలో టాప్ టెన్ సంపాదన పరుల్లో పదో స్థానంలో ఉందట అనిత. మరి సినిమాల్లో అంత సక్సెస్ కాలేకపోయినా.. ఈ నటి ప్రతిభకు మంచి అవకాశాలు లభిస్తున్నట్టే.
హిందీ టీవీ షో ఇండస్ట్రీలో బాగా సంపాదిస్తున్నది కపిల్ శర్మ. అతడి రెమ్యూనరేషన్ ఎపిసోడ్ కు డెబ్బై ఎనభై లక్షల వరకూ ఉంది.