నాగార్జున.. వాట్‌ యాన్‌ ఎక్స్‌ప్రెషన్‌

'మనం' సినిమా గుర్తుందా.? సమంత, నాగచైతన్య తల్లిదండ్రులైతే, వారి కుమారుడు బిట్టు.. ఆ బిట్టు పాత్రలో నాగార్జున.. ఇంకో జన్మలో నాగార్జున, శ్రియ జంటకి బిడ్డగా జన్మించిన చైతన్య.. చైతన్య పాత్రలో అక్కనేని నాగేశ్వరరావు. అదొక అద్భుత సినీ కావ్యం. అందులో, బిట్టు (నాగార్జున)కి తల్లిగా నటించింది సమంత. నిజ జీవితంలో నాగార్జునకి కోడలవుతోందిప్పుడు సమంత. తన కుమారుడు నాగచైతన్యకీ, సమంతకీ ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని నాగార్జున సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. ఎంత అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్‌తో ఆ విషయాన్ని ప్రకటించాడో తెలుసా.! 

'మా అమ్మ, కూతురయ్యింది..' అంటూ నాగచైతన్య, సమంతల ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని ప్రస్తావించాడు నాగార్జున. ఇంతకన్నా అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇంకేముంటుంది.? కోడల్ని కూతురిగా నాగార్జున పేర్కొనడం.. వావ్ టచ్ చేసేశాడు నాగార్జున అందరి మనసుల్నీ. నాగచైతన్య, సమంత గత కొంతకాలంగా లవ్‌లో మునిగి తేలుతున్న విషయం విదితమే. ఇద్దరూ ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా తమ మధ్య ప్రేమనీ, ఆ ప్రేమలో మునిగి తేలుతున్న క్షణాలకు సంబంధించిన మధురానుభూతుల్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. 

ఇక, నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌ నిశ్చితార్థం కూడా ఈ మధ్యనే జరిగింది. త్వరలో అఖిల్‌ పెళ్ళి జరగనుంది. నాగచైతన్య - సమంతల పెళ్ళి కబురు కూడా అతి త్వరలోనే వెల్లడి కానుంది.

Show comments