పాటలో భావ కవిత్వం

తెలుగు సినిమా పాటలపై ఆ మధ్య సంగీత దర్శకుడు కీరవాణి కాస్త ఘాటుగానే కామెంట్లు చేసారు. మరీ అంత కాకున్నా, తెలుగు సినిమా పాటల్లో మంచి పదాలు, భావాలు కాస్త తగ్గాయన్నది మాత్రం వాస్తవం. అయితే ఇవ్వాళ ఓ పాట విడుదలయింది. నారా రోహిత్ నటించిన కథలో రాజకుమారి చిత్రంలోనిదీ పాట. కృష్ణ కాంత్ రాసారీ పాటను. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఈపాటలో కాస్త భావుకతతో కూడిన మంచి పద ప్రయోగాలు చేసారు.

మరల రా - అలా అలా మేఘాల మాటు దాగిపోయెనా - తనుంటే తారాడే, తళుక్కు తారలే - ఆ నవ్వులే  ఆపేనులే పెదాల గోడలే - మౌనాలె వచ్చి చేరెనా, పదాల ముందరే, ఆ మెరుపులే మరచెనే కనులనే ఇలా - నీ కురులనే చీకటంటూ దాచుకుందా వెన్నెలా? – నీ గురుతులే తరమవే మనసునే ఇలా – వీక్షణాలే ఈ క్షణాన – దాటిపోవు కన్నులే – తప్పున్నా తప్పేనా? – తప్పించవే చెలీ దూరమే – మరల రా..

ఇలా ఓ చిన్న పాటి భావ కవితలా వుందీ సాహిత్యం. మరి ఇంత భావుకత వుంది పాటలో, టైటిల్ కూడా కథలో రాజకుమారి అంటూ వెరైటీగా వుంది. ఇప్పటిదాకా నారా రోహిత్ రొమాంటిక్ లవ్ స్టోరీలు పెద్దగా అటెంప్ట్ చేయలేదు. మరి ఈ సినిమా విషయమేమిటొ చూడాలి.

Show comments