బాలయ్యతో బిజినెస్ మేన్-2

సినిమా కూడా ప్రారంభం అయింది. కానీ ఇప్పటికీ అందరికీ ఒకటే డౌట్. బాలయ్యకు పూరిజగన్నాధ్ ఏం చెప్పి ఒప్పించాడా అని. ఓపెనింగ్ రోజు ఈ విషయంపై చిన్న క్లారిటీ వచ్చింది. సన్నిహితులు కొందరి దగ్గర సినిమా లైన్ గురించి పూరీజగన్నాధ్ చర్చించాడు. అంతేకాదు, ప్రెస్ మీట్ లో మీడియాకు కూడా చిన్న హింట్ ఇచ్చాడు. కొత్త సినిమాలో బాలయ్య డైలాగుల మీద డైలాగులు చెబుతూనే ఉంటాడని, కేవలం ఒక్క పంచ్ డైలాగ్ కే ఫిక్స్ అయిపోకుండా... డైలాగ్స్ అన్నీ కలుపుకొని ఏకంగా ఓ సీడీ రిలీజ్ చేయొచ్చని పూరిజగన్నాధ్ ఊరించాడు. ఇక్కడే సగం మేటర్ అందరికీ అర్థమైపోయింది. పూరిజగన్నాధ్ బాలయ్యతో బిజినెస్ మేన్-2 తీయబోతున్నాడని అంతా ఫిక్స్ అయిపోయారు. 

మహేష్-పూరి కాంబోలో వచ్చిన బిజినెస్ మేన్ సినిమా హిట్ అయింది. ఇది ఏ రేంజ్ హిట్ అనే విషయాన్ని పక్కనపెడితే, ఇందులో ప్రతి డైలాగ్ పేలింది. పూరి పెన్ పవర్ ను మరోసారి ఎలివేట్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు ఇదే కోవలో బాలయ్య సినిమా కూడా ఉంటుందని ఇండైరెక్ట్ గా చెబుతున్నాడు పూరి. ప్రతి ఫ్రేమ్ లో నటసింహం విశ్వరూపం కనిపిస్తుందని అంటున్నాడు. 

పూరిజగన్నాధ్ దగ్గర స్క్రిప్టులు ఎప్పుడూ రెడీమేడ్ గా పడి ఉంటాయి. ఈ విషయాన్ని గతంలో అతడే ఓసారి చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా పూరి షెల్ఫ్ లో పెండింగ్ లో ఉన్న స్క్రిప్ట్స్ లో ఆటోజానీ, జనగణమన స్టోరీలు రెడీగా ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. గతంలో చిరంజీవికి ఆటోజానీ, మహేష్ కు జనగణమన స్టోరీలైన్లు వినిపించాడు పూరి. ఇప్పుడు ఆ రెండు స్టోరీలనే మిక్స్ చేసి, బిజినెస్ మేన్ టైపులో ఓ యాక్షన్ కథను వండినట్టు తెలుస్తోంది. ఆ కథకే బాలయ్య పచ్చజెండా ఊపాడట.

Show comments