యామీ గౌతమ్‌.. అల్ట్రా గ్లామరస్‌.!

'కాబిల్‌' సినిమాలో అంధురాలిగా కన్పించిన యామీ గౌతమ్‌, మరోమారు హృతిక్‌ రోషన్‌తో జతకట్టబోతోందట. ఈసారి చేయబోయే సినిమాలో తాను అల్ట్రా గ్లామరస్‌గా కన్పిస్తానంటోంది. అయితే, ఆ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అప్పుడే చెప్పబోనంటోంది. త్వరలోనే, అన్ని వివరాలూ వెల్లడవుతాయని యామీ గౌతమ్‌ చెప్పుకొచ్చింది. 

హృతిక్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చాలా అద్భుతంగా పండిందనీ, ఈ విషయంలో హృతిక్‌ కో-ఆపరేషన్‌ ఎప్పటికీ మర్చిపోలేనని యామీ గౌతమ్‌ చెబుతోంది. నిజానికి హీరో హీరోయిన్లు ఇద్దరూ అంధులైనప్పుడు, వారి మధ్య రొమాన్స్‌ అనేది ఎవరూ ఆశించరనీ, అయితే, 'కాబిల్‌'లో రొమాన్స్‌ చాలా రొమాంటిక్‌గా వర్కవుట్‌ అయ్యిందని అంటోన్న యామీ గౌతమ్‌, తన కెరీర్‌లోనే 'కాబిల్‌' ది బెస్ట్‌ ఫిలిం.. అని ఫిక్సయిపోయింది. 

'కాబిల్‌' సినిమా కమర్షియల్‌గా వర్కవుట్‌ అవుతుందా.? లేదా.? అన్నది సినిమా నిర్మాణం సందర్భంలో ఎవరూ ఆలోచించలేదనీ, మంచి సినిమాని తెరకెక్కించడమ్మీదే ఫోకస్‌ పెట్టామనీ, సినిమా తమకు మంచి ఫలితాన్నిచ్చిందని అంటోంది యామీ గౌతమ్‌. తెరపై అల్ట్రా గ్లామరస్‌గా కన్పించడం తనకిష్టమనీ, అయితే ఎక్కువగా పెర్ఫామెన్స్‌కి ప్రాధాన్యమున్న పాత్రలే దక్కుతుండడంతో తనలో అల్ట్రా గ్లామరస్‌ యాంగిల్‌ ఇంతవరకు బయటకు రాలేదనీ, త్వరలో ఆ యాంగిల్‌ని ఆడియన్స్‌ చూడబోతున్నారని యామీ గౌతమ్‌ ఓ ప్రశ్నకి సమాధానమిచ్చింది. 

తెలుగులో 'గౌరవం', 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' తదితర సినిమాల్లో యామీ గౌతమ్‌ నటించిన విషయం విదితమే. 

Show comments