పూరి..? తరువాత ఏంటీ?

మహేష్ తో సినిమా అంటూ పేరు కూడా ప్రకటించేసినంత పని చేసారు దర్శకుడు పూరి జగన్నాధ్. ప్రస్తుతం ఆయన కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్నారు. మహేష్ -మురగదాస్ సినిమా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. దీని తరువాత పూరి జగన్నాధ్ సినిమా వుంటుందేమో అనుకున్నారంంతా. 

కానీ మహేష్ కొరటాల శివతో ఫిక్సయిపోతే, 2017 సమ్మర్ దాకా మహేష్ డేట్ లు వుండవు. పూరి మాత్రం మరో నెలా రెండు నెలల్లో ఫ్రీ అయిపోతారు. మరి ఏ హీరో వుంటారు అప్పటికి? ఎన్టీఆర్, చరణ్, బన్నీ, ఇలా అందరూ బిజీనే. తలా సినిమా ఇప్పటికే ఓకె చేసేసుకున్నారు. 

మరి ఇక పూరికి దొరికే హీరో ఎవరు వుంటారో? ఖాళీ వున్నా నితిన్ చేసే అవకాశం తక్కువ. రామ్ తో చేస్తే బెటరేమో? ఇంతవరకు రాని కాంబినేషన్ కదా? అవును ఇంతకీ పూర్తయిన రోగ్ సినిమా సంగతేమిటో?

Readmore!
Show comments

Related Stories :