చైతూ...ఎందుకు ఈ సైలెన్స్...?

దసరాకు వస్తున్న సినిమాలు పోటాపోటీగా వున్నాయి. అన్నీ కాస్త ప్రామిసింగ్ సినిమాలే. కాస్త భారీ సినిమాలే. అందుకే పబ్లిసిటీని కుమ్మేస్తున్నాయి. టీవీ ఆన్ చేస్తే చాలు పది ప్రకటనల్లో అయిదు జాగ్వార్ సినిమా ప్రకటనలే వుంటున్నాయి. సినిమా కోసమే కోట్లు కుమ్మరించిన కుమారస్వామి గౌడ తన కొడుకు సినిమా ప్రమోషన్ ను కూడా ఆ రేంజ్ లోనే చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

జాగ్వార్ తరువాత వీడు గోల్డ్ ఎహె సినిమా ప్రచారం కూడా టీవీల్లో బాగానే సాగుతోంది. మంచి కామెడీ ట్రయిలర్ల కటింగ్ తో సినిమాకు నెమ్మదిగా బజ్ తెస్తున్నారు. ఇక తమన్నా-ప్రభుదేవాల అభినేత్రికి కూడా టీవీ పబ్లిసిటీ ఓకె. ప్రకాష్ రాజ్ మన వూరి రామాయణం కూడా అప్పుడప్పుడు దర్శనం ఇస్తోంది. 

కానీ నాగ్ చైతన్య ప్రేమమ్ సినిమా ప్రకటనలు మాత్రం ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లలో అస్సలు దర్శనం ఇవ్వడం లేదు. నిజానికి అన్ని సినిమాలకన్నా ఈ సినిమా మీదే ఆసక్తి ఎక్కువ వుంది. మరి అందువల్ల, పోస్టు రిలీజ్ పబ్లిసిటీ చేద్దామనో, లేదా మండే తరువాత స్టార్ట్ చేద్దామనో వెయిట్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. లేదా ఎంటర్ టైన్ మెంట్ చానెళ్ల కన్నా, న్యూస్ చానెళ్ల మీద దృష్టి పెట్టారో?

Show comments