సూపర్‌ స్టార్‌ కుమార్తెకి కలిసొచ్చేనా.?

సూపర్‌ కృష్ణ కుమార్తె మంజుల, హీరో సందీప్‌ కిషన్‌తో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. మంజుల తొలిసారి దర్శకురాలిగా మారి ఈ చిత్రాన్ని రూపొందిస్తుండడం గమనార్హం. నటిగా, నిర్మాతగా మంజుల ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేశారు కూడా. ఆనంది ఇందిరా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో మంజుల దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో త్రిధా చౌదరి, అమైరా దస్తుర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

తన సోదరి మంజుల, తొలిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించాడు మహేష్‌. హీరోయిన్‌గా తెరంగేట్రం చేయడానికి ఒకప్పుడు మంజుల చాలా ప్రయత్నాలే చేసిన విషయం విదితమే. అయితే, అభిమానులనుంచి ఆమెకు ఆశించిన స్థాయిలో సపోర్ట్‌ దొరకలేదు సరికదా, వ్యతిరేకత ఎదురయ్యింది. దాంతో, నటిగా పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రల కోసం ప్రయత్నించారామె. 

ఇక, ఈసారి దర్శకురాలిగా అవతారమెత్తుతున్న మంజుల, ఈ కొత్త ప్రయత్నంలో ఎంతవరకు సఫలమవుతారో ఏమో.! అన్నట్టు, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె, 'కొచాడియాన్‌' సినిమాతో దర్శకురాలిగా మారి పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే.

Show comments