హమ్మయ్య.. ఆ సినిమా చేసేసారండీ బాబూ

ఎప్పుడో వచ్చింది తమిళంలో యామిరుక్కు భయమే అని ఓ సినిమా. మన మారుతి ప్రేమకథాచిత్రమ్ టైపు సినిమా. ఆ సినిమాను తెలుగులో చేయాలని గీతా ఆర్ట్స్ ప్రయత్నం.

ఆ డీవీడీని అందుకోని హీరో లేడు. అల్లరి నరేష్, సునీల్, నిఖిల్, ఇలా చాలా మంది చేతులు మారింది ఆ డీవీడీ. కానీ హీరోయిజం పావలా వంతు కూడా లేదని చాలా మంది దాన్ని వదిలేసారు. కానీ గీతా ఆర్ట్స్ మాత్రం వదల లేదు.

తండ్రి వారసత్వంగా వదిలిన బిల్డింగ్ ను లాడ్జిగా మార్చడం, దానికి ఆత్మలు నిత్యం క్యూ కట్టడం, ఈ వ్యవహారంలో పుట్టుకువచ్చే కామెడీనే యామిరుక్కు భయమే సినిమా.

సరైన డైరక్షన్ చాన్స్ కోసం తమ చుట్టూ తిరుగుతున్న ప్రభాకర్ (ఒకప్పుడు ఈటీవీ)కి ఆ ప్రాజెక్టును అప్పగించింది. ఆఖరికి ఆది సాయికుమార్ దొరికాడు. దాంతో ప్రభాకర్-ఆది సాయికుమార్ కాంబినేషన్ లో ఫినిష్ చేసేసారు. రీమేక్ కావడం, పైగా సినిమా అంతా దాదాపు ఒకే  బిల్డింగ్ లో జరగుతుంది.

ఒరిజనల్ ప్రకారం అయితే ఒకటి రెండు కాల్ షీట్ల ఆర్టిస్టులే ఎక్కువ. అందుకే సినిమాను సైలెంట్ గా చకచకా ఫినిష్ చేసేసారు. ఆది సరసన హాట్ ఏంకర్ రేష్మీ గౌతమ్, కామెడీ బ్రహ్మాండంగా పండించగ బ్రహ్మాజీ తదితరులు వున్నారు ఈ సినిమాలో.

గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి ఎప్పుడో, గ్రౌండ్ మొత్తం ఖాళీ గా వున్న టైమ్ చూసి వదుల్తారు.

Show comments