శాతకర్ణిలో హైలైట్ అవేనంట

శాతకర్ణి టీజర్ వచ్చింది. దీపావళి లుక్ వచ్చింది. చూసిన వారికి ఏమనిపిస్తుంది. సినిమాలో యుద్ధమే కీలకం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రెండూ అలాంటివే. పైగా గౌతమీ పుత్ర శాతకర్ణి యుద్ధ పిపాసి అని చరిత్ర చెబుతోంది. పైగా మాస్ జనాలకు ఇలాంటి చారిత్రక సినిమాల్లో కూడా ఏ మేరకు యుద్ధం వుంటే అంత నచ్చుతుంది. అయినా కూడా శాతకర్ణిలో యుద్దాన్ని మించి ఆకట్టుకునే విషయాలు రెండు వున్నాయట. 

అవి ఒకటి తల్లి (హేమమాలిని) కొడుకు (బాలయ్య)ల మధ్య వచ్చే సన్నివేశాలు. రెండు భార్య (శ్రియ) భర్త (బాలయ్య)ల నడుమ వచ్చే సన్నివేశాలు. భావోద్వేగ సన్నివేశాలు పండించడంలో దర్శకుడు క్రిష్ ది అందెవేసిన చేయి. పైగా మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ కూడా ఇలాంటి సీన్లకు మంచి మాటలు అందిస్తారు. సో, సినిమాలో బాలయ్య-హేమమాలిని-శ్రియల మధ్య వచ్చే సీన్లు సినిమాకు హైలైట్ అవుతాయి అంటున్నారు రష్ చూసిన వారు.

10 నుంచి శివరాజకుమార్

ఈ నెల 10 నుంచి 14 వరకు కన్నడ హీరో శివరాజ్ కుమార్ వచ్చి శాతకర్ణి సినిమా షూట్ లో పాల్గొంటారు. శాతకర్ణికి సంబంధించినంత వరకు అదే లాస్ట్ షెడ్యూల్. ఈ షెడ్యూల్ తో శాతకర్ణి టాకీ పార్ట్ పూర్తయిపోతుంది. మరో పక్క రామోజీ ఫిల్మ్ సిటీలో పాటల చిత్రీకరణ జరుగుతోంది. 15 నాటికి వాటిని కూడా ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట. 

Show comments