జనసేనకు దరఖాస్తుల జోరు

ఆలు లేదు..చూలు లేదు..అంటే ఇదేనేమో? అసలు జనసేన పార్టీ కి రంగు, రూపు ఇంకా రాలేదు. తుపాకులకు గుండెలడ్డగల గండరగండడలు పార్టీకి కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు దగ్గర నుంచి అన్నీతానే అయిన పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. కానీ అలాంటి వాళ్ల సంగతేమో కానీ, పవన్ ఇమేజ్ ను క్యాష్ చేసుకుని రాజకీయాల్లో రాణించేయాలనుకున్నవారు మాత్రం అప్పుడే రుమాళ్లు వేసి, అప్లికేషన్లు పెట్టేస్తున్నారు.

అందరికన్నా ముందుగా పవన్ సోదరుడు నాగబాబే రెడీ అయిపోయారు. పవన్ కోరకపోయినా తానే వెళ్లి అడిగి మరీ పార్టీకి, పవన్ కు తన సేవలు అందిస్తానంటూ చెప్పేసారు ఆయన. టాలీవుడ్ లో సినిమాలు తక్కువ, హడావుడి ఎక్కువ అనుకునే నిర్మాత బండ్ల గణేష్ కూడా తానూ రెడీనే అంటూ ఓ ఇంటర్వూలో చెప్పేసారు. ఎంపీ కావాలి. మినిస్టర్ కావాలి అంటూ చాలా కొరికల చిట్టానే విప్పారు.

ఇప్పుడు మరో కేండిడేట్ రెడీ అయిపోయారు. క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా తన మనసులో మాట బయట పెట్టేసారు. ఏ పార్టీ అయినా రెడీ అంటూనే పవన్ పార్టీ అంటే ఇష్టపడుతున్నట్లు మాటల్లో చెప్పేసారు. తరువాత తరువాత మళ్లీ ప్లేస్ లు ఖాళీ వుంటాయో వుండవో అని ఒక్కొక్కరు బయటకు తేల్తున్నట్లు కనిపిస్తోంది. ఇంకెందరు రెడీ అవుతారో.

Readmore!
Show comments

Related Stories :