కానుక.. మళ్లీ నాసిరకమే

చంద్రన్న కానుక..ఖజానాకు కాస్త భారమే అయినా, పండుగ నాడు పేదలకు కాస్త ఫ్రీ సరుకులు లభిస్తున్నాయన్నది ఓ సహేతుక కారణంగా ప్రభుత్వం కొనసాగిస్తోంది. పార్టీ డబ్బులతో సరుకులు కొని పంచి, ఓట్లు ఆశిస్తే తప్పు కానీ, ప్రభుత్వం డబ్బులతో సరుకులు పంచి, ఓట్లు ఆశిస్తే తప్పుకాదు..చట్టబద్ధం కూడా. పైగా పార్టీలకు ఖర్చు తప్పుతుంది. సరే మళ్లీ ప్రజలపైనే భారం పడుతుంది..అది వేరే సంగతి. 

అంత తెలివిగా మన జనాల ఆలోచిస్తే, రాజకీయ నాయకుల ఆలోచనలు ఇలా వుండవు కదా? ఈ సంగతి అలా వుంచితే, చంద్రన్న కానుక..ఖజానాకు భారమైనా, సరఫరా చేసే వ్యాపారులకు లాభాలు పండిస్తోందట. తమ దగ్గరున్న నాసి రకం సరుకులు, ప్రభుత్వానికి అంటగట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో పండగపూట జనం అందుకుంటున్న సరుకలు వాళ్లకి ఆనందాన్ని పంచకపోగా,  ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయట. 

ముఖ్యంగా అమరావతిలో భాగమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంపిణీ చేస్తున్న సరుకులు పరమ నాసిరకంగా వుంటున్నాయట. గోధుమ పిండిలో పావుశాతం పొట్టు కలిపి కల్తీ చేసి, ప్యాక్ చేసారట. పంచదార కూడా రెండో రకానిదేనట. నెయ్యి అయితే కంపు కొడుతుంటే..జనం తీసుకోవడానికే నిరాకరిస్తున్నారట. దీంతో అధికారులు, నెయ్యి మార్చేస్తున్నాం అని వివరణ ఇస్తున్నారట. అదీ సంగతి .

గతంలో కూడా చంద్రన్న కానుకలు నాసిరకంగా వుండడం, దీనిపై సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆగ్రహం వ్యక్తం చేయడం, పౌర సరఫరాల మంత్రినే నిలదీయడం వంటి సంఘనటలు జరిగిన సంగతి తెలిసిందే. ‘దేశం’ అభిమానులకు గమనిక..ఇది సాక్షిలో ప్రచారంలోకి వచ్చన వార్త కాదు..ఈనాడులో వచ్చిన వార్తలోని సమాచారమే. Readmore!

Show comments

Related Stories :