థమన్ కు చాన్సిచ్చిన చిరు

సేమ్ టు సేమ్ మ్యూజిక్ ఇచ్చే థమన్ అని ఎవరు ఎంతలా వెక్కిరించినా, ఎస్ ఎస్ థమన్ కు చాన్స్ లు వచ్చి పడుతూనే వున్నాయి. మరో మాంచి అవకాశం కూడా అలాగే వచ్చింది. తన 151 వ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ థమనే అంటూ స్టేజ్ మీదే ప్రకటించేసారు మెగాస్టార్ చిరంజీవి. 

నిన్నటికి నిన్న అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన మెగాస్టార్ మాట్లాడుతూ, తాను చేయబోయే 151 సినిమాకు సంగీత దర్శకుడికి నువ్వే అంటూ థమన్ కు చెప్పేసారు. అంతే కాదు, మంచి రోజు కాబట్టి అగ్రిమెంట్ అయిపోయినట్లే అని కూడా ప్రకటించేసారు. సో, చిరు సినిమా కూడా చేసేస్తే, థమన్ ఆల్ మోస్ట్ ఆల్ టాప్ హీరోస్ అందరితో చేసేసినట్లే అవుతుంది. 

ఈ సంగతి అలా వుంచితే, ఎప్పుడైతే హీరోయిన సెట్ అయితే, ఇక 150 సినిమా చకచకా తయారైపోతుందట. ఇన్నాళ్లు కాస్త అలా అలా నెమ్మదిగా సాగుతున్న ఈ సినిమాను చకచకా ఫినిష్ చేసి, అనుకున్న ప్రకారం జనవరికి జనం ముందుకు తీసుకురావాలని, ఫిబ్రవరి నుంచి 151వ సినిమా స్టార్ట్ చేయాలన్నది మెగాస్టార్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ సినిమా గీతా ఆర్ట్స్ నిర్మాణంలో వుండొచ్చు.

Readmore!
Show comments

Related Stories :