'బిగ్‌బాస్‌'లో ఎన్టీఆర్‌ కెవ్వుకేక.!

బుల్లితెరపై యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'హోస్ట్‌'గా ఎలా కన్పిస్తారు.? అన్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది. నీటుగా సూట్‌ వేసుకున్నా, లోపల మాస్‌ యాంగిల్‌ అలాగే వుందని ఎన్టీఆర్‌ చెప్పకనే చెప్పేశాడు. 'నటుడిగా ఈ స్థానానికి తీసుకొచ్చిన ప్రేక్షకుల్ని ఇంటింటికీ వెళ్ళి పలకరించాలనుకున్న తన కోరిక ఇలా నెరవేరింది..' అంటూ బుల్లితెర ఆడియన్స్‌ మనసుల్ని గెలిచేసుకున్నాడు ఎన్టీఆర్‌. 

బిగ్‌బాస్‌ రియాల్టీ షో అనగానే అందులోని హౌస్‌ గురించి ఎక్కువ ఉత్కంఠ నెలకొంటుంది. హౌస్‌ని సూపర్బ్‌గా తీర్చిదిద్దేశారు. స్విమ్మింగ్‌ పూల్‌ చూడగానే, ఓ డైవ్‌ వేసెయ్యాలనిపించింది.. అంటూనే, సూట్‌లో వున్నాను కదా, కుదరదులే.. అని 'చిలిపితనం' ప్రదర్శించేశాడు యంగ్‌ టైగర్‌. 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది.? తొలిసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నా, అస్సలేమాత్రం బెరుకు లేదు, తడబాటు అస్సలే లేదు. కంప్లీట్‌ ఎనర్జీతో ఎన్టీఆర్‌ 'బిగ్‌బాస్‌' రియాల్టీ షో ద్వారా సత్తా చాటనుండడం ఖాయం. తెలుగు బుల్లితెరకు సంబంధించి ఇప్పటిదాకా వున్న రియాల్టీ షోలన్నిటికీ 'బాప్‌' అనే స్థాయిలో బిగ్‌ బాస్‌ షో వుంటుందని చెప్పొచ్చేమో.!

Show comments