అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసిన పవన్?

ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. లెక్కప్రకారం ఈ మూవీ తర్వాత నేసన్ దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలి. కానీ పవన్ ఆ సినిమా చేయట్లేదట. తాజా సమాచారం ప్రకారం, ఆ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ ను పవన్ వెనక్కి ఇచ్చేశాడని తెలుస్తోంది. 

నేసన్ ప్రాజెక్టు నుంచి పవన్ ఎందుకు తప్పుకున్నాడనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఓ వైపు జనసేన పార్టీ బలోపేతం కోసం పవన్ గ్యాప్ తీసుకుంటాడంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా చేసేందుకే, ఏఎం రత్నం ప్రాజెక్టు నుంచి పవన్ తప్పుకున్నట్టు పుకార్లు వస్తున్నాయి. రీజన్ ఏదైనా దర్శకుడు నేసన్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయిందనేవాళ్లే ఎక్కువమంది. 

త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాతోనే ఈ ఏడాది దాదాపు అయిపోతుంది. ఎన్నికలకు సమాయత్తం అవ్వాలంటే పవన్ కు ఉన్నది కేవలం 2018 సంవత్సరం మాత్రమే. ఆ ఏడాది కూడా మరో సినిమా పెట్టుకుంటే పవన్ పొలిటికల్ కెరీర్ నిర్మాణానికి టైం సరిపోకపోవచ్చు. సో.. ప్రస్తుతం చేస్తున్న మూవీతోనే పవన్ తన సినీకెరీర్ ను కొన్నాళ్లు పక్కన పెట్టొచ్చంటూ వార్తలు వస్తున్నాయి.

Show comments