చరణ్ పాత ప్రేమకథ

సుకుమార్ ఈ సారి ఏం చేస్తారు? మహేష్ తో నేనొక్కడినే , ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ తో ఆర్య 2, నాగ్ చైతన్యతో 100% లవ్ లు చేసినపుడల్లా, ఒక దానికి మరో దానికి ఎక్కడా పొంతన లేకుండా చూసుకున్నాడు. ఇప్పుడు చరణ్ కు మరి ఏం చేస్తారు? సుకుమార్-చరణ్ ల ది 80 ల నాటి ప్రేమకథ అంట. సినిమా మొత్తం 80ల్లోనే జరుగుతుంది. 

అంతే కానీ, కొంత పాత,కొత్త వర్తమానం ఇలా కాదు. సినిమా మొత్తం 1980ల కాలంలోనే సాగుతుంది. సాధారణంగా అంతా పాత కాలం అంటే మరీ 1947 టైమ్ కు వెళ్తారు. కానీ సుకుమార్ అలా కాదు. స్టార్ట్ ఫోన్ లు, ఇంటర్ నెట్ లు లేని కాలంలో ప్రేమ ఎలా వుండేది అన్నది చూపించబోతున్నారట. తీన్ మార్ లో ఇలాంటిది కొంత కాశీ బ్యాక్ డ్రాప్ లో వుంటుంది. 

అలాంటిది సుకుమార్ స్టయిల్ లో ఫుల్ లెంగ్త్ లో చూపించబోతున్నారన్నమాట. అంటే పుస్తకాల్లో ప్రేమ లేఖలు, అమ్మాయిలు తల వంచుకు నడవడాలు, హీరోలు బుద్దిగా వుండడం వంటివి వుంటాయేమో? అంటే ఒక విధంగా కుమారి 21 ఎఫ్ కి పూర్తి కాంట్రాడిక్టరీగా వుంటుందన్నమాట. 

Show comments