జిబ్రాన్ కు అవసరమా ఇదంతా?

టాలీవుడ్ లో ప్రతిభ లేకపోయినా చలామణీ అయిపోవచ్చు అదృష్టం వుంటే. కానీ డిసిప్లిన్ లేకపోయినా, కాంట్రావర్సీలకు తావిచ్చినా, పక్కన పెట్టేస్తారు. అందుకే ఎంత ఎదిగినా ఒదిగి వుండడం అన్నది టాలీవుడ్ జనాలు నేర్చుకునే సూత్రం. లోపల ఒరిజినల్ ను అలాగే వుంచుకుని, బయటకు ఎంత నాన్ కాంట్రా వర్సీగా వుండాలో అంతా వుంటారు. కానీ యంగ్ మ్యూజిక్ డైరక్టర్ జిబ్రాన్ వ్యవహారం ఇందుకు రివర్స్ లో నడుస్తోంది. 

సినిమా రంగంలో చాలా లింక్ లు వున్న నిర్మాత అనిల్ సుంకరతో కాస్త సున్నం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అనిల్ సుంకర కు ఇటు ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, అటు 14 రీల్స్, ఇంకా అభిషేక్ పిక్చర్స్, అటు వారాహి సంస్థలతో ఆర్థిక సంబంధాలో, స్నేహ సంబంధాలో వున్నాయి. హైపర్ సినిమాకు 14 రీల్స్ సంస్థను జిబ్రాన్ చాలా ఇబ్బంది పెట్టినట్లు టాక్. తానేదో టూర్ వేసుకోవడంతో పాటలు లేట్ చేయడంతో, రీరికార్డింగ్ మణిశర్మతో చేయించారు.

ఇతగాడేమో, హీరో, డైరక్టర్, నిర్మాత అందరూ ఇన్ పుట్స్ ఇచ్చి, ఇటు అటు లాగేస్తున్నారని, అందుకే ఇక ఆ సంస్థలో చేయనని తెగేసి చెప్పేసాడట. దాంతో ఎకె సంస్థలో రాజ్ తరుణ్ చేసే సినిమా అనూప్ రూబెన్స్ కు వెళ్లిపోయింది. 

పోనీ ఈ వ్యవహారం ఇలా సైలెంట్ గా వుండిపోతే బాగుండేది. అలా కాకుండా నిర్మాతదే తప్పనట్లు ఫీలర్లు బయటకు వదిలారు. దాంతో నిర్మాణ వర్గాలు, అసలు కథ ఇదంటూ అట్నుంచి ఫీలర్లు వదులుతున్నారు. వెరసి ఇదంతా ఓ మెస్ గా తయారవుతోంది. పైగా హైపర్ సినిమాకు అడియో ఎంత మైనస్ అన్నది అందరికీ తెలిసిపోయింది కూడా. దానా దీనా జరిగేది ఏమిటంటే..దీనివల్ల తెలుగులో అనవసరంగా జిబ్రాన్ కు అవకాశాలు తగ్గే ప్రమాదం వుంది. అయినా నాకేంటి..నా టాలెంట్ నాకుంది..అనుకుంటే ఎవరేం చేయలేరు. ఇక్కడ టాలెంట్ తో పాటు టైమ్ కి పనిచేయడం, డిసిప్లిన్ కూడా ముఖ్యమే.

Show comments