భాగమతి కోసం మూడున్నర కోట్ల సెట్

యువి క్రియేషన్స్ సంస్థ హీరోయిన్ అనుష్క తో భారీ సినిమాగా భాగమతిని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియో ఎసి ఫ్లోర్ లో భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. సుమారు మూడున్నర కోట్లు కేవలం ఈ సెట్ కోసమే ఖర్చుచేస్తున్నారు. 

ఇది సినిమాలో భాగమతి భవంతిగా కనిపిస్తుంది. నాలుగువందల ఏళ్ల కిందటి కల్చర్, నిర్మాణ శైలిని దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్మిస్తున్నారు. అయితే సినిమాను తమిళ తెలుగు భాషల్లో నిర్మిస్తున్నందున కేవలం నైజాం కల్చర్ నే కాకుండా, తమిళ కల్చర్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఆర్ట్ డైరక్టర్ రవీందర్ సెట్ తయారు చేస్తున్నారు. 

నైజాం టైమ్ లో టెక్నాలజీ కూడా వుండేది. అంటే కుళాయిలు, హ్యాండ్ ఫాన్లు, ఇలా. భారీ కర్టెన్లను జరపడానికి టెక్నాలజీ వాడేవారు ఆ రోజుల్లో. అందుకే అది కూడా ఈ సెట్ లో వినియోగిస్తున్నారు. మొత్తం మీద భాగమతిని కాస్త డిఫరెంట్ గా తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు అశోక్ కుమార్ దర్శకుడు.

Show comments