80 శాతం సంతృప్తా.. ఎన్నికలకు రావొచ్చుగా బాబూ!

కొత్త విషయాన్ని సెలవిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీలో 80 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. తమ సర్వేలో ఈ విషయం తేలిందని ఆయన చెప్పారు.  80 శాతం మందిని సంతృప్తి పరిచామని ఇక మిగతా  20 శాతం మందినీ త్వరలోనే సంతృప్తి పరుస్తామని కూడా బాబు సెలవిచ్చారు. 

మరి ఈ సంతృప్తి లెక్కలు ఆసక్తికరంగా ఉన్నాయి... ఎవరో అనామకులు కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు ఇలా అన్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది కూడా తమ సర్వేలో ఈ విషయం తేలిందని ఆయన వివరించారట.

ఇక ఈ ప్రకటనపై కొందరు గట్టి సెటైర్లే వస్తున్నారు. 80 శాతం సంతృప్తి, 20 శాతం అసంతృప్తి కాదు.. చంద్రబాబు కన్ఫ్యూజ్ అయ్యి ఈ మాట చెప్పి ఉంటారు.. 20 శాతం సంతృప్తి, 80 శాతం అసంతృప్తి అని చెప్పబోయి బాబు.. అలా చెప్పి ఉంటారనే మాట వినిపిస్తోంది. వెనుకటికి... భారతదేశాన్ని అవినీతి మయం చేస్తాను అని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. నీతిమయం చేస్తాను అని చెప్పబోయి..  బాబు భారతదేశాన్ని అవినీతిమయమైన భారతదేశంగా మారుస్తాను అని బాబు ఒత్తి చెప్పారు. బహుశా అలాగే ఇప్పుడు కూడా.. సంతృప్తి, అసంతృప్తి.. అనే మాట విషయంలో కన్ఫ్యూజ్ అయ్యారేమో అనుకోవాల్సి వస్తోందని వీరు అంటున్నారు.

ఆ సంగతలా ఉంటే..80 శాతం మంది సంతృప్తిఉందని  సర్వేలో తేలిఉంటే.. ఎంచక్కా ఎన్నికలకు వెళ్లవచ్చు కదా.. అనేది ఒక ధర్మ సందేహం. ఎలాగూ ఇరవైమంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను వైకాపా నుంచి చేర్చుకున్నారు. వాళ్ల విషయంలో విమర్శలకు వైకాపా నుంచి గట్టిగా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు సిగ్గు.. లజ్జ.. ఉందా? అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు వైకాపా నేతలు. ఆయన వ్యభిచరిస్తున్నాడు.. అంటూ కూడా వారు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. 80 శాతం సంతృప్తి ఉంది కాబట్టి.. ఫిరాయింపుదారుల చేత ఎంచక్కా రాజీనామా చేయించవచ్చు కదా! 

ఎన్నికలకు వెళ్లి సంతృప్తిగా ఉన్న 80 శాతం ప్రజల ఓట్లను సొంతం చేసుకుని సత్తా చాటవచ్చు కదా! అప్పుడు విపక్షం నోరు ఆటోమెటిక్ గా మూతపడుతుంది కదా! ఇలాంటివి ఎవరూ అడగకూడదు.. బాబుగారి మాటలు వింటూ ఉండాలంతే!

Show comments